శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (18:32 IST)

బ‌ర్త్‌డే సంద‌ర్భంగా 'మోస‌గాళ్లు'లో న‌వీన్ చంద్ర లుక్ విడుద‌ల‌

విష్ణు మంచు హీరోగా న‌టిస్తోన్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'మోస‌గాళ్లు' కోసం ప్రేక్ష‌కులు అమితాస‌క్తితో ఎదురు చూస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా ఇది విడుద‌లవుతోంది. 
 
24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై 'మోస‌గాళ్లు' చిత్రాన్ని నిర్మిస్తోన్న విష్ణు మంచు ఇదివ‌ర‌కెన్న‌డూ లేని విధంగా దాన్ని ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌కు, టీజ‌ర్ల‌కు సూప‌ర్బ్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. 
 
లేటెస్ట్‌గా న‌వీన్ చంద్ర బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని ఆయ‌న‌కు విషెస్ తెలియ‌జేస్తూ, సినిమాలో ఆయ‌న లుక్‌ను విడుద‌ల చేశారు. 'మోస‌గాళ్లు' మూవీలో సిద్ అనే పాత్ర‌ను న‌వీన్ చంద్ర చేస్తున్నారు. ఇంటెన్స్ లుక్స్‌తో, మాస్ అప్పీల్‌తో ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో ఆయ‌న క‌నిపిస్తున్నారు.
 
చ‌రిత్ర‌లో న‌మోదైన అతిపెద్ద ఐటీ స్కామ్ నేప‌థ్యంలో త‌యార‌వుతున్న 'మోస‌గాళ్లు' మూవీకి లాస్ ఏంజెల్స్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. విష్ణు సోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ఆయ‌న జోడీగా రుహీ సింగ్ న‌టిస్తున్నారు.  
 
తారాగ‌ణం:
విష్ణు మంచు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సునీల్ శెట్టి, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర‌, రుహీ సింగ్‌
సాంకేతిక బృందం:
ద‌ర్శ‌క‌త్వం: జెఫ్రీ గీ చిన్‌
నిర్మాత‌: విష్ణు మంచు
బ్యాన‌ర్‌: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ
సినిమాటోగ్ర‌ఫీ: షెల్డ‌న్ చౌ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కిర‌ణ్‌కుమార్ ఎం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్‌కుమార్ ఆర్‌.
పీఆర్వో: వంసశీ-శేఖ‌ర్‌