హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా వర్గో పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కుతోన్న చిత్రం `సెహరి`. సంగీత దర్శకుడు కోటి కీలక పాత్ర పోషిస్తున్నఈ చిత్రాన్నిజ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మిస్తున్నారు. నవంబర్ 16 హీరో హర్ష్ కనుమిల్లి పుట్టిన రోజు సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నటసింహ సందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై `సెహరి`ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ - ``మొదటి కార్తీక సోమవారం పర్వదినాన వర్గో పిక్చర్స్ మొదటి చిత్రం `సెహరి` ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. అలాగే ఈ రోజు ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నహర్ష్ పుట్టినరోజు కూడా. ఈ చిత్ర నిర్మాత అద్వయ జిష్ణు రెడ్డి నా స్నేహితుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మేనళ్లుడు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడానికి వచ్చినప్పుడు సినిమా కథ ఏంటి అని అడిగాను. కథ చెప్పారు బాగుంది అన్నాను.
సినిమా నిడివి 2 గంటలలోపు క్రిస్పీగా ఉండేలా చూసుకొమ్మని సలహా ఇచ్చాను. ఈ సినిమా కోసం యంగ్ టీమ్ అందరూ కలిసి చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఈ సినిమా విడుదలై వర్గో పిక్చర్స్ బేనర్‌కి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని, అలాగే నటీనటులు, దర్శక నిర్మాతలు మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్య సూత్రాలు పాటించండి`` అన్నారు.
చిత్ర నిర్మాతలు అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి మాట్లాడుతూ - ``మా సెహరి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని నందమూరి బాలకృష్ణ గారు విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజు మా హీరో మా హీరో హర్ష్ కనుమిల్లికి పుట్టిన రోజు. మా టీమ్ అందరి తరపున పుట్టినరోజు శుబాకాంక్షలు తెలుపుతున్నాం. సెహరి మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభించి సక్సెస్ ఫుల్‌గా మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం. ఫస్ట్ షెడ్యూల్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ద్వారా చాలా మంది కొత్త నటీనటులు, టెక్నీషియన్స్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. సినిమా పెద్ద హిట్ అయ్యి మా టీమ్ అందరికీ మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం``అన్నారు.
చిత్ర దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక మాట్లాడుతూ,``మా మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని బాలకృష్ణగారు విడుదల చేస్తున్నారు అనగానే చాలా ఎగ్జయిటింగ్ గా అనిపించింది. బాలకృష్ణ గారికి మా టీమ్ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మూవీ ఒక న్యూ ఏజ్ లవ్‌స్టోరిగా తెరకెక్కుతోంది. యంగ్ పీపుల్స్‌తో కూడిన మంచి టీమ్ కుదిరింది. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
హీరో హర్ష్ కనుమిల్లి మాట్లాడుతూ, ``ఈ పుట్టినరోజు నా జీవితంలోని వన్ ఆఫ్ ది బెస్ట్ బర్త్‌డే.. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడకు వచ్చిన బాలకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్. మా ఫ్రెండ్స్ నిజ జీవితంలో జరిగిన ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఈ కథ రాయడం జరిగింది. తప్పకుండా మీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. పుట్టినరోజు సందర్భంగా నాకు విషెస్ తెలిపిస ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు`` అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి, నటులు అభినవ్ గోమటం, ప్రనీత్ కళ్లెం తదితరులు పాల్గొన్నారు.
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి, కోటి, బాలకృష్ణ (సీనియర్ యాక్టర్), అభినవ్ గోమటం, ప్రనీత్ కళ్లెం, అనీషా అల్ల, అక్షిత శెట్టి, రాజేశ్వరి, శ్రిస్తి, యశ్వంత్, అనీల్ కుమార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సాంకేతిక వర్గం.
బ్యానర్: వర్గో పిక్చర్స్
దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక
నిర్మాతలు: అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి
ప్రొడక్షన్ డిజైనర్: మేఘన కనుమిల్లి
సినిమాటోగ్రఫి: సురేష్ సారంగం
సంగీతం: ప‌్రశాంత్ ఆర్. విహారి
ఎడిటర్: రవితేజ గిరిజల
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్,
కథ: హరీష్ కనుమిల్లి,
పిఆర్ఒ: వంశీ - శేఖర్.