లుంగీ కట్టిన బర్త్‌డే బాయ్... ''లవ్ స్టోరి'' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

love story movie still
డీవీ| Last Updated: సోమవారం, 23 నవంబరు 2020 (18:51 IST)
అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ''లవ్ స్టోరి'' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దర్శకుడు శేఖర్ కమ్ముల, నాయిక సాయి పల్లవి, చిత్ర నిర్మాతలు కె నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు నాగ చైతన్యకు బర్త్ డే విశెస్ తెలిపారు. ''లవ్ స్టోరి'' మూవీ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. థియేటర్ల పరిస్థితి మెరుగయ్యాక సినిమాను విడుదల చేయనున్నారు. ఓ ఆహ్లాదకర ప్రేమ కథగా తెరకెక్కుతున్న ''లవ్ స్టోరి'' సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

చైతూ బర్త్ డే స్పెషల్ పోస్టర్ చూస్తే... ఆయన లుంగీ, బనియన్ మీద కనిపిస్తున్నారు. నిత్య జీవితంలో మనల్ని మనం పోల్చుకునే ఓ సాధారణ యువకుడి పాత్రలో నాగ చైతన్య సహజంగా నటిస్తున్నట్లు లుక్ ద్వారా తెలుస్తోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల మార్క్ క్యారెక్టరైజేషన్ చైతూ లుక్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

దర్శకుడు శేఖర్ కమ్ముల విశెస్ చెబుతూ..''కొన్ని స్నేహాలు ఎంతో ఆనందాన్నిస్తాయి. చైతూతో అసోసియేషన్ అలాంటి సంతోషాన్నే ఇస్తుంది. హ్యాపీ బర్త్ డే చైతన్య'' అని ట్వీట్ చేశారు.

రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ''లవ్ స్టోరి'' చిత్రానికి సినిమాటోగ్రఫీ : విజయ్ సి.కుమార్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత : భాస్కర్ కటకంశెట్టి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావు, రచన, దర్శకత్వం : శేఖర్ కమ్ముల.దీనిపై మరింత చదవండి :