అడివి శేష్ హీరోగా 'హిట్ 2`
Hit2 Clap Nani
`క్షణం, గూఢచారి, ఎవరు` వంటి వైవిధ్యమై కథా చిత్రాల్లో హీరోగా నటించిన తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇప్పుడు దేశభక్తితో నిండిన పాన్ ఇండియా మూవీ `మేజర్`లో నటిస్తున్న అడివిశేష్ కృష్ణ దేవ్ అలియాస్ కె.డి పాత్రలో నటిస్తున్న 'హిట్ 2' రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ ఆఫీసర్ అమ్మాయి మిస్సింగ్ కేసుని ఎలా డీల్ చేశాడనే కాన్సెప్ట్‌తో హిట్ (మోమిసైడ్ ఇంటర్‌వెన్షన్ టీమ్) సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెందిన హిట్ టీమ్ ఆఫీసర్ కృష్ణ దేవ్ అలియాస్ కె.డి ఈ ఎగ్జయిటింగ్ జర్నీని కంటిన్యూ చేయబోతున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు.
నటీనటులు:
అడివిశేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు
సాంకేతిక వర్గం:
సమర్పణ: నాని
బ్యానర్: వాల్‌పోస్టర్ సినిమా
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను
సినిమాటోగ్రఫీ: మణికందన్
సంగీతం: జాన్ స్టీవర్స్ ఎడురి
ఆర్ట్: మనీషా ఎ.దత్
ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకట్ రత్నం(వెంకట్)
తర్వాతి కథనం
