బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (17:47 IST)

వెంకటేష్ `దృశ్యం 2` ప్రారంభమైంది

Venkatesh opening scean
వెంకటేష్‌, మీనా జంటగా న‌టించిన `దృశ్యం` సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందో అందరికీ తెలిసిందే. మ‌ళ్లీ విక్టరీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా దృశ్యం సినిమాకి సీక్వెల్‌గా `దృశ్యం 2` వ‌స్తోంది. దృశ్యం, దృశ్యం 2 ఒరిజిన‌ల్ మ‌ళ‌యాల వెర్ష‌న్ డైరెక్ట్ చేసిన జీతు జోసెఫ్ ఈ మూవీతో తెలుగు ప‌రిశ్ర‌మ‌కి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రై.లి, ఆశిర్వాద్ సినిమాస్‌, రాజ్‌కుమార్ థియేట‌ర్ ప్రై.లి ప‌తాకాల‌పై డి. సురేష్‌బాబు, ఆంటోని పెరుంబ‌వూర్‌, రాజ్‌కుమార్ సేతుప‌తి నిర్మిస్తున్నారు.

Drushyam team
మంగ‌ళ‌వారంనాడు హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లోని దేవాల‌యంలో పూజా కార్యక్రమాల‌తో ప్రారంభ‌మైంది. విక్టరీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో న‌దియ‌, న‌రేష్‌, ఏస్త‌ర్ అనిల్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండ‌గా స‌తీష్ కురూప్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చి 5 నుండి ప్రారంభంకానుంది.