శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (17:51 IST)

జగపతి బాబుకు అప్పుడేమో సౌందర్య.. ఇప్పుడేమో ప్రియమణి..!?

Priyamani_jagapathi babu
ఇదేంటి అనుకుంటున్నారా? అప్పట్లో జగ్గూబాయ్‌కి సౌందర్యతో కలిసి చేసే సినిమాలు బాగా కలిసొచ్చాయి. మాంచి హిట్ అయ్యేవి. ఆ తర్వాత ప్రియమణితో జగపతి బాబు సినిమాకు కూడా ఆయనకు మంచి గుర్తింపు సంపాదించిపెట్టాయి. అప్పట్లో సౌందర్యలా.. జగపతి బాబు, ప్రియమణిల కాంబోలో వచ్చిన సినిమాలు, ఆ సమయంలో ఈ ఇద్దరిపై వచ్చిన రూమర్లు అన్నీ ఇన్నీ కావు.
 
ప్రియమణి వరుసగా జగపతి బాబుతో కలిసి నటించడంతో గుసగుసలు మొదలయ్యాయి. వరుసగా ఐదు చిత్రాల్లో జంటగా కనిపించి అందర్నీ మెప్పించారు. అయితే తాజాగా జగపతి బాబు బర్త్ డే సందర్భంగా ప్రియమణి స్పెషల్ విషెస్ అందించింది. అంతే కాకుండా మళ్లీ ఎప్పుడు నటిద్దామని అందరి ముందే అడిగేసింది.
 
ప్రస్తుతం ప్రియమణి, జగపతి బాబు ఇద్దరూ కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ప్రియమణి ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ఫుల్ బిజీగా ఉంది. ఫ్యామిలీమెన్ 2 వెబ్ సిరీస్ రిలీజ్‌కు రెడీగా ఉంది. అంతేకాకుండా వెంకటేష్ హీరోగా వస్తోన్న నారప్ప సినిమాలోనూ ప్రియమణి నటిస్తోంది. అసురన్ సినిమాలో మంజూ వారియర్ పోషించిన పాత్రను తెలుగులో ప్రియమణి పోషిస్తోంది. 
 
ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ మొదటి సీజన్‌లో ప్రియమణి కనిపించి అందరినీ కట్టిపడేసింది. గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. మరోవైపు జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్, సైడ్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్స్‌లో దుమ్ములేపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జగపతి బాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రియమణి అసలు విషయం అడిగేసింది. నేను ఆయనతో ఐదు సినిమాల్లో నటించాను.. జగ్స్ మళ్లీ మనం కలిసి ఎప్పుడూ నటిద్దామని అడిగేసింది. 
 
దానికి సమాధానంగా.. ఆమెతో మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది.. పక్కింటి అమ్మాయిలా ఎంతో సరదాగా ఉంటుంది. మంచి వ్యక్తి.. ఎప్పుడైనా సరే కలిసి నటించాలని ఉంటుంది..అయితే నేను కూడా అదే అడుగుతుంటాను.. అయితే అది ఎప్పుడు జరుగుతుందో చూడాలని జగపతి బాబు అన్నాడు. మరి ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఎప్పుడొస్తుందోనని ఫ్యాన్స్ ఆత్రుతగా వేచి చూస్తున్నారు.