గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (10:26 IST)

పవన్ మాజీ భార్య రెండో ఇన్నింగ్స్ : మేకప్ వేసుకోనున్న రేణూ దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఆమె అతి త్వరలోనే ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వెళ్లనున్నారు. ఆద్య అనే చిత్రంలో ఆమె నటిచనున్నారు. ఈ చిత్రాన్ని డీఎస్ రావు, ఎస్. రజనీకాంత్‌లు సంయుక్తంగా నిర్మిచనున్నారు. 
 
ఈ బహుభాషా చిత్రంలో రేణూ దేశాయ్ ఓ శక్తిమంతమైన మహిళ పాత్రను పోషించనున్నారు. మంచి కథ ఉంటే తాను తిరిగి సినిమాల్లో నటించేందుకు సిద్ధమని గతంలో పలుమార్లు చెప్పిన రేణు, దర్శకుడు ఎంఆర్ కృష్ణ చెప్పిన కథను ఓకే చేశారు. తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఈ సినిమాతోనే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
 
ఇక, ఈ చిత్రంలో వైభవ్, సాయి ధన్సిక, నందినీ రాయ్, తేజ, కీతికా రతన్ తదితరులు నటిస్తుండగా, దీనిని డీఎస్ రావు, ఎస్ రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమాను నిర్మించనున్నామని, ఈ నెలలో ప్రారంభమయ్యే షూటింగ్ మార్చి వరకూ కొనసాగుతుందని, ఆపై సమ్మర్ సీజన్‌లో విడుదల చేస్తామని నిర్మాత డీఎస్ రావు వెల్లడించారు.