మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (13:24 IST)

రేణూ దేశాయ్ ''ఆద్య''.. విజయదశమి నుంచి ప్రారంభం..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. తద్వారా తన రెండో ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుడుతోంది. ఈ చిత్రానికి ఆద్య అనే పేరు ఖరారైంది. ''ఆద్య'' అనే పేరు కూడా రేణు దేశాయ్ కుమార్తెదే కావడం విశేషం. 
 
డి.ఎస్.కె.స్క్రీన్-సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రావ్.డి.ఎస్- రజనీకాంత్.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ద్వారా ఎం.ఆర్.కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ''కబాలి'' ఫేమ్ సాయి ధన్సిక, నందిని రాయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ హీరో ‘వైభవ్ తత్వవాడి’ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
 
రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్మాత రజనీకాంత్.ఎస్ తెలిపారు. ''హుషారు'' ఫేమ్ తేజ కురపాటి- గీతిక రతన్ యువ జంటగా నటించే ఈ ''ఆద్య'' విజయదశమి రోజు ఆరంభం కానుంది. 
 
ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరధి, కథ-మాటలు: ఆదిత్య భార్గవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కృష్ణ చైతన్యరెడ్డి.ఎస్, ప్రొడ్యూసర్స్: రావ్ డి.ఎస్-రజనీకాంత్.ఎస్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎం.ఆర్.కృష్ణ మామిడాలలు అందిస్తున్నారు.