శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 జనవరి 2021 (12:18 IST)

నానిని పెళ్లి కొడుకు చేస్తున్నారుగా.. ఫోటో భలే వుందే..!

Tuck Jagadish
నేచురల్ స్టార్ నాని తాజా సినిమా.. టక్ జగదీష్ నుంచి పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫస్ట్‌లుక్‌ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో చాలా డీసెంట్‌గా టక్ వేసుకొని అన్నం ముందు కూర్చున్న నాని వెనుక నుండి కత్తి తీయడం అందరిలో అంచనాలు పెంచింది.
 
ఇక తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో నానిని పెళ్లి కొడుకును చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. ఇందులో జగదీష్ నాయుడు అనే పాత్రలో కనిపించి సందడి చేయనున్నాడు నాని. 
 
టక్ జగదీష్ చిత్రం మంచి ఎమోషన్స్‌తో కూడిన పూర్తి కుటుంబ నాటక చిత్రంగా రూపొందుతుందని తెలుస్తుండగా, ఇందులో రీతూవర్మ, ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాహుగారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. జగపతిబాబు, నాజర్, రావురమేష్, నరేష్, మురళీశర్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.