మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (13:44 IST)

రామ్ అల్లాడి దర్శకత్వంలో సంస్కృత సినిమా 'నభాంసి'

Ram alladi, poster
న‌భాంసి అంటే తెలుగులో `ఆకాశాలు` అని అర్థం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా సోమ‌వారంనాడు చిత్రీకరణప్రారంభం చేస్తున్న‌ట్లు రామ్ అల్లాడి తెలిపారు.  రామ్ అల్లాడి, ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్‌మేకర్. న్యూయార్క్, అమెరికాలో స్థిరపడిన భారతీయుడు. ప్రవాసాంధ్రుడు. "చేసిల్డ్" డాక్యుమెంటరీతో ఆయన దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంలో ప్రజల ప్రశంసలతో పాటు 11 అంతర్జాతీయ పురస్కారాలుఅందుకున్నారు.

దర్శకుడిగా రెండోసారి "రా'స్ మెటనోయా" రూపొందించారు. జాతిపితమహాత్మా గాంధీపై తీసిన ఈ చిత్రానికి 14 అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. ఇప్పుడు రామ్ అల్లాడి ఓ సంస్కృత సినిమా 'నభాంసి' రూపొందిస్తున్నారు. దర్శకుడిగా రామ్ అల్లాడి మూడో ప్రాజెక్ట్ 'నభాంసి' (ఆకాశాలు). ఈ చిత్రాన్ని పూర్తిగా సంస్కృతంలో తెరకెక్కించనున్నారు. రామ్ అల్లాడి దర్శకత్వంలో 'మెటనోయా' నిర్మించిన ఏఆర్ ఐటీవర్క్స్ సంస్థ ఇప్పుడీ 'నభాంసి'ను నిర్మిస్తోంది. ఆల్రెడీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్పూర్తయింది. 
 
ఈ సందర్భంగా రామ్ అల్లాడి మాట్లాడుతూ "వెయ్యి సంవత్సరాల క్రితం మన దేశంలోజరిగిన కథగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. భార్యాభర్తల మధ్య జరిగే రొమాంటిక్ కథ ఇది. తన చిన్ననాటి అమూల్యమైన జ్ఞాపకాల్ని చేధిస్తూ ఉంటాడు భర్త. ఆ చేధనలోభార్యతో జరిగే రొమాన్స్ ఇది. చివరి వరకూ ఆ జ్ఞాపకాల్ని చేధించడం కోసమేతపిస్తుంటాడు. ఒక విధంగా అర్ధ నారీశ్వర తత్త్వం అని చెప్పవచ్చు. సాహిత్యం, సంగీతం, నృత్యానికి సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కనుమరుగైపోయిన కొన్ని నృత్యాలనుమా చిత్రంలో చూపించబోతున్నాం.

అలాగే, ఆ కాలం నాటి సెట్స్, కాస్ట్యూమ్స్ సిద్ధంచేయించాం. సీజీ వర్క్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మొత్తం ప్రీ ప్రొడక్షన్ కినాలుగైదు నెలల సమయం పట్టింది. 75 శాతం సినిమాను అమెరికాలో తీస్తాం. మరో 25 శాతం సినిమా చిత్రీకరణ మన దేశంలోని కొన్ని దేవాలయాల్లో చేస్తాం. ఇందులో మతాలు, తత్వాలకు సంబంధించిన చర్చకు తావు లేదు" అని అన్నారు. సినిమాలో ప్రధాన పాత్రలుఅన్నిటినీ ప్రవాస భారతీయులు పోషించనున్నారని ఆయన తెలిపారు.
 
సంస్కృతంలో సినిమా తీయాలని అనుకోవడానికి గల కారణాన్ని రామ్ అల్లాడి వివరిస్తూ,‌ ఆ కాలంలో అమూల్యమైన జీవితాన్ని కవితాత్మకంగా చెప్పడానికి సంస్కృతం బాగా ఉపయోగపడుతుంది. సంస్కృతంలో 'నభ' అంటే 'ఆకాశం' అని అర్థం. 'నభాంసి' అంటే ఆకాశాలు అని అర్థం. కన్నడ దర్శకుడు జీవీ అయ్యర్ సంస్కృతంలో తొలి సినిమా ఆదిశంకరాచార్య' చేశారు. తర్వాత సంస్కృతంలో 'భగవద్గీత' తెరకెక్కించారు. రెండూప్రజాదరణ పొందాయి.

పురస్కారాలు అందుకున్నాయి. ఆ రెండూ చూసినప్పుడు సంస్కృతంలో సినిమా చేయాలని అనుకున్నాను. 'ఆదిశంకరాచార్య', 'భగవద్గీత' తర్వాత సంస్కృతంలో పెద్దగా సినిమాలు రాలేదు. ఒకరిద్దరు మలయాళ దర్శక, నిర్మాతలుచేశారంతే. 'నభాంసి' కోసం నేను సంస్కృతం నేర్చుకున్నాను" అన్నారు. మరిన్ని వివరాలుత్వరలో వెల్లడిస్తామని ఆయన చెప్పారు. 2022లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.   
 
ఈ చిత్రానికి  సంభాషణలు : సరితా నవాలి , మధు గుంటుపల్లి , ఎడిటర్: రాకేష్ చల్లా, సినిమాటోగ్రఫీ: రామ్ అల్లాడి - సతీష్ రొంటల, మ్యూజిక్ డైరెక్టర్: భరద్వాజ్ వి. కొమరగిరి, ప్రొడక్షన్ హౌస్: ఏఆర్ ఐటీవర్క్స్, స్క్రీన్ ప్లే - డైరెక్షన్: రామ్ అల్లాడి