సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (11:57 IST)

ఇల్లందులో ఆచార్య.. మెగాస్టార్ వెంట చెర్రీ.. ఫోటోలు వైరల్

Megastar Chiranjeevi
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా చిత్రీకరణ సింగరేణి జేకే ఓపెన్‌ కాస్ట్‌లో ప్రారంభించారు. బొగ్గుట్టకు పుట్టినిల్లయిన ఇల్లందులో తొలిసారిగా మెగాస్టార్‌ చిరంజీవి అడుగుపెట్టారు. ఆదివారం ఇల్లెందు వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవికి జీఎం పి.వి.సత్యనారాయణ, ప్రాజెక్టు అధికారి బొల్లం వెంకటేశ్వర్లు, ఎస్టేట్‌ అధికారి తౌరియా నాయక్‌ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
 
పట్టణంలోని ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన 12 నుంచి 15 ఏండ్ల వయసున్న 30 మంది బాలురు, హైదరాబాద్‌ నుంచి 50 మంది మొత్తం 80 మంది ఓసీలో బాలకార్మికులుగా నటించడానికి సెలెక్ట్‌ చేశారు. వారం రోజుల పాటు ఈ షూటింగ్‌ జరగనుంది. బాలకార్మికులతో విలన్‌ సోనూసోద్‌ పనులు చేయిస్తుండటంతో మెగాస్టార్‌ చిరంజీవి, రాంచరణ్‌ ఫైటింగ్‌ సీన్‌ చిత్రీకరించనున్నట్టు తెలిసింది. 
 
ఉత్పత్తికి అంతరాయం కలుగకుండా ఈ సమయంలో ఓసీ బ్లాస్టింగ్‌ నిర్వహించినట్టు తెలిసింది. సాయంత్రం మరో సెషన్స్‌ షూటింగ్‌ తీశారు. షూటింగ్‌కు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. షూటింగ్‌ ఓసీ లోపల ఎక్కడో నిర్వహిస్తున్నారు. బయట సీక్వెల్‌ వద్ద పోలీసులు, సినిమా సిబ్బంది మోహరించారు.