1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 7 మార్చి 2021 (20:30 IST)

ఖమ్మంలో 'ఆచార్య': మంత్రి పువ్వాడ సత్కారం

ఖమ్మంలోని మమత ఆసుపత్రిలో గల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటికి విచ్చేసిన ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్‌లకి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వాగతం పలికారు.
 
ఇల్లందులో ఆచార్య చిత్ర షూటింగ్ నిమిత్తం ఖమ్మంకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్‌లకి మంత్రి పువ్వాడ తన ఇంట్లో బస ఏర్పాటు చేశారు.
 
ఈ సందర్భంగా స్వయంగా వారికి స్వాగతం పలికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువతో సత్కరించారు. షూటింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్నందుకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.