1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. iBomma gives Big Shock to Indian Users

యూజర్లకు షాకిచ్చిన "ఐబొమ్మ" వెబ్‌సైట్

iBomma Website
సినీ ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు "ఐబొమ్మ" (iBomma). ఈ వెబ్‌సైట్‌లో కొత్తగా విడుదలయ్యే సినిమాలను హై క్వాలిటీ రెజల్యూషన్‌లో ఉచితంగా చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌ను రన్ చేయడం కష్టంగా మారింది. దీంతో దీన్ని త్వరలోనే మూసివేయాలని భావిస్తున్నారు. అయితే, అంతర్గతంగా ఏం జరిగిందో కానీ ఆ నిర్ణయంపై ఐబొమ్మ వెనక్కి తగ్గింది. అదేసమయంలో ఐబొమ్మ తీసుకున్న నిర్ణయం యూజర్లకు షాకిచ్చింది. కేవలం 30 సినిమాలు మాత్రమే చూసే అవకాశం కల్పించింది. 
 
ఇప్పటివరకు ఐబొమ్మ ఓటీటీలో విడుదలైన అన్ని చిత్రాలు అందుబాటులో ఉండేవి. విడుదలైన చాలాకాలం తర్వాత సెర్చ్ ఆప్షన్‌లో సినిమా లేదా వెబ్ సిరీస్ పేరు టైప్ చేస్తే ఆ సినిమా చూపించేది. కానీ, ఇకపై అలా చూడటం కుదరదు. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో సెర్చ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేసింది. ఇకపై ఇండియన్ యూజర్లు చివరగా అప్‌లోడ్ చేసిన 30 సినిమాలు మాత్రమే చూసే అవకాశం కల్పించారు. 
తర్వాతి కథనం
సైకలాజికల్ థ్రిల్లర్‌గా వస్తున్న అర్థం నాకు వెరీ స్పెషల్ - శ్రద్దాదాస్