దుర్గగుడి టెండర్లలో జగన్ సర్కారు హైకోర్టులో ఎదురుదెబ్బ!
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. దుర్గగుడి టెండర్ల విషయంలో జగన్ సర్కారును హైకోర్టు తలంటింది.
శానిటేషన్, హౌస్ కీపింగ్ కోసం టెండర్లు పిలిచిన దుర్గ గుడి అధికారులు.. టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించలేదని, తమను టెండర్లలో పాల్గొనకుండా చేశారంటూ లా మెక్లయిన్ ఇండియా అనే సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... రద్దు చేసిన టెండర్లను రీ ఓపెన్ చేయాలని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లా మెక్లయిన్ ఇండియా సంస్థను టెండర్లలో పాల్లొనే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వెంటనే టెండర్లను తెరవాలని ఆదేశించింది.