సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (15:35 IST)

సుప్రీంకోర్టులో జగన్ సర్కార్‌కు చుక్కెదురు

సుప్రీంకోర్టులో జగన్ సర్కార్‌కు చుక్కెదురైంది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు రూ. 1లక్ష జరిమానా విధించింది సుప్రీంకోర్టు. దేవీ సీ ఫుడ్ లిమిటెడ్ కేసులో.. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ... ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
 
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఏపీ సర్కార్ పిటిషన్ కొట్టివేయటమేగాక... హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకుగాను... జరిమానా విధించిన అత్యున్నత న్యాయస్థానం. ఇంకా ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలను సమర్థించింది.