1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Kannada Superstar Puneet Rajkumar Passessaway

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరు....

Kannada Superstar
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌ కుమార్‌ ఇకలేరు. ఆయన వయసు 46 యేళ్లు. సూపర్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఈ హీరో శుక్రవారం ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలారు. దీంతో ఆయన్ను హుటాహుటిన బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు.
 
తొలుత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఉదయమే ప్రకటించిన ఆసుపత్రి వర్గాలు.. ఆయన మరణించినట్లు తాజాగా ప్రకటించాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఆసుపత్రికి వచ్చి పునీత్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. 
 
ఆ తర్వాత కాసేపటికే ఆయన మరణవార్తను ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. పునీత్‌ రాజ్ కుమార్‌ మరణం నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా హైఅలర్ట్ విధించారు. సినిమా హాళ్లు ఏవీ తెరవొద్దని ప్రభుత్వం ఆదేశించింది.
 
కన్నడ లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ తనయుడుగా శాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్‌కుమార్ త‌న టాలెంట్‌తో ప‌వ‌ర్ స్టార్ అని పిలిపించుకుంటున్నాడు. పునీత్ మంచి డ్యాన్స‌ర్ కూడా కావ‌డంతో ఆయ‌న‌కు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
 
పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఐసీయూలో చికిత్స అందించారు. ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఎన్ని చేసినా ప్రయోజనం లేకపోయింది. కన్నడ పవర్‌ స్టార్‌ కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
రజనీకాంత్‌కు ఆపరేషన్ సక్సెస్ : మీడియా బులిటెన్