మంగళవారం, 16 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 జులై 2022 (11:11 IST)

ఆర్ఆర్ఆర్‌పై పోర్న్‌‌స్టార్‌..హీరోలిద్దరూ చాలా హ్యాండ్సమ్ ఉన్నారు..

Kendra Lust
Kendra Lust
ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఏడాది మార్చి 25న విడుదలైంది. జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్‌గా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. 
 
థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది. తాజాగా ఈ మూవీని ఒక పోర్న్‌ స్టార్‌ పొగడ్తలతో ముంచెత్తింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాను ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో చూసిన పోర్న్‌‌స్టార్‌ కేండ్రా లస్ట్‌ ట్విట్టర్‌ వేదికగా కొనియాడింది. 
 
''నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. రామ్‌‌చరణ్‌, ఎన్టీఆర్‌ నటన, స్టంట్స్‌, డైలాగ్‌ డెలీవరీ, పాటలు, సినిమాటోగ్రఫీ .. ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉంది. హీరోలిద్దరూ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. వారిద్దరి నటన 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు ఆత్మలాంటింది'' అని ట్వీట్ చేసింది.