నాగ శౌర్య రంగబలి తో రాబోతున్నాడు
Naga Shaurya, Rangbali
పవన్ సిహెచ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ మన ఊరిలో ఎవడ్రా అపేది పాట విడుదలైయింది. నాగ శౌర్య అత్యంత ఎనర్జిటిక్ బీట్‌లతో ఈ పెప్పీ నంబర్‌తో మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఈ పాట లోకల్ లో ఉండడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. అనురాగ్ కులకర్ణి ఈ పాటని డైనమిక్‌గా పాడాడు. నాగశౌర్య తన మాస్ డ్యాన్స్‌లతో పాటలో గ్రేస్ చూపించాడు. జానీ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. పవన్ బాసంశెట్టి, శ్రీ హర్ష ఈమని కలిసి సాహిత్యం అందించారు.
ఈ సినిమాలో నాగ శౌర్య విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు, ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యారు. ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు విభిన్నమైన క్రాఫ్ట్‌లను హ్యాండిల్ చేస్తున్నారు.
దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, పవన్ సిహెచ్ సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్.
షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది.
