శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 11 మే 2023 (16:56 IST)

నాగ శౌర్య నటిస్తున్న రంగబలి జూలై 7న రాబోతుంది

Naga Shaurya
Naga Shaurya
హీరో నాగ శౌర్య రంగబలి అనే ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కోసం డెబ్యూ  దర్శకుడు పవన్ బాసంశెట్టి తో కలిసి పనిచేస్తున్నారు. ఉగాది నాడు విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో, పల్లెటూరి నేపథ్యం లో సాగే కథతో రంగబలి ఫన్ రైడ్‌ గా ఉండబోతోందనే సూచనను అందిస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌ లతో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించడంలో మంచి అభిరుచి ఉన్న ఎస్‌ ఎల్‌ వి సినిమాస్‌ కు చెందిన సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత వైభవంగా నిర్మిస్తున్నారు.
 
లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. రంగబలి జూలై 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. నాగ శౌర్య ట్రెండీ గెటప్‌ లో కనిపిస్తున్న పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. హీరోయిన్, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తారు మేకర్స్.