మంగళవారం, 12 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 20 నవంబరు 2022 (14:20 IST)

ఇంటివాడైన హీరో నాగశౌర్య... అనూషా శెట్టితో పెళ్లి

nagashaurya wedding
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. బెంగుళూరులోని ఓ నక్షత్ర హోటల్లో ఈ వివాహం జరిగింది. 
 
ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు నూతన వధూవరులకు అభినందలు తెలుపుతున్నారు. ఈ వేడుకలో నాగశౌర్య, అనూష వేలికి ఉంగరం తొడిగారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలకు సంబంధించి ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ పెళ్లికి వచ్చిన అతిథులకు పసందైన రాయల్ భోజనం వడ్డించారు.