గురువారం, 12 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2022 (23:43 IST)

సంకష్టహర చతుర్థి.. మోదకం, పాలు సమర్పిస్తే.. మానసిక అలసట పరార్

Vinayaka
సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడుని పూజించడం ద్వారా శుభం చేకూరుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. "సంకష్టం" అంటే కష్టాల సమాహారం. జీవితంలో వచ్చే కష్టాలన్నీ తొలగిపోవడానికి చతుర్థి వ్రతం ఆచరిస్తారు. పౌర్ణమి తర్వాత నాలుగవ రోజు సంకష్టహర చతుర్థిని జరుపుకుంటారు. ఆ రోజు సాయంత్రం, రాత్రి వినాయకుడిని పూజిస్తారు. 
 
మనం ఏ దేవుడిని పూజించినా, ముందుగా పూజించేది వినాయకుడిని. చతుర్థి రోజున ఉదయం స్నానం చేసి ఇంటి దగ్గరలో ఉన్న విఘ్నేశ్వర స్వామిని ఆలయానికి వెళ్లాలి. వినాయకుడిని 11 సార్లు ప్రదక్షణలు చేసి పూజించాలి. 
 
గరికతో అర్చన చేయించాలి. గుడికి వెళ్లలేని పక్షంలో మోదకం, పాలు, తేనె, జామ, అరటిపండు, పాయసం వంటి వాటితో ఇంట్లోనే గణపతిని పూజించవచ్చు. ఏ పనిలోనైనా విజయం సాధించడం కోసం వినాయకుడిని ముందుగా పూజించాలి. ఏ పనికైనా వినాయకుడిని ముందుగా పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోయి విజయం చేకూరుతుంది.
 
వినాయక చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం ద్వారా మానసిక, శారీరక బలం చేకూరుతుంది. మానసిక అలసట తొలగిపోతుంది. ఎప్పుడూ చురుకుగా వుంటారు. గణేశుడిని పూజిస్తే మోక్షానికి విఘాతం కలిగించే అహంకారంతో కూడిన త్రిగుణాలు నశిస్తాయి. 
 
గణేశుడు అపారమైన జ్ఞానాన్ని, తెలివిని ఇస్తాడు. వినాయకుడికి ప్రతీకగా భావించే ఏనుగు తల జ్ఞానానికి ప్రతీకగా చెబుతారు. అందుకే చతుర్థి రోజున వినాయక ఆరాధన విశేష ఫలితాలను ప్రసాదిస్తుంది.