గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (19:26 IST)

వృశ్చికరాశిలోకి శుక్రుడు.. మకరం, కుంభం, మీన రాశుల వారికి?

Lakshmi Puja
వృశ్చికరాశిలోకి శుక్రుడు నవంబర్ 13న ప్రవేశించబోతున్నాడు. తద్వారా అష్టలక్ష్మీ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ ప్రభావం ముఖ్యంగా మూడు రాశులపై వుంది. ఈ యోగా ప్రభావం అన్ని రాశులపైనా కనిపిస్తుంది. కానీ మూడు రాశుల వారికి ప్రత్యేక ఫలాలను అందించనుంది. 
 
మకర రాశి వారికి అష్టలక్ష్మి యోగం శుభప్రదం. ఎందుకంటే మీ రాశి నుండి 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. అందుచేత వ్యాపారాభివృద్ధి, లాభాలు తప్పవు. మీరు మీ భాగస్వామితో చేసే ఏ పెట్టుబడి అయినా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, ఈ సమయంలో మీరు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందవచ్చు. ఈ కాలంలో మీరు నీలిరంగు రత్నాన్ని ధరించవచ్చు.  
 
కుంభ రాశి
అష్టలక్ష్మి రాజయోగం మీకు ఆర్థికంగా లాభదాయకం. ఆదాయ వనరులలో ఆకస్మిక పెరుగుదల ఉండవచ్చు. సమయం అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు.
 
మీన రాశి
అష్టలక్ష్మి రాజయోగం మీన రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో తొమ్మిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. ఈ సమయంలో మీరు అదృష్టవంతులుగా కనిపిస్తున్నారు. మీరు వ్యాపారానికి సంబంధించి విహారయాత్రకు వెళ్ళవచ్చు. అవివాహితులు శుభవార్తలు వింటారు.