శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (19:22 IST)

జూలై 12 తిరోగమన శని సంచారం.. ఈ రాశుల వారికి భలే అదృష్టం..

shaniswara swamy
జూలై 12న మకరరాశిలో తిరోగమన శని సంచారం జరుగనుంది. శనీశ్వరుడు ప్రస్తుతం తన సొంతరాశి చక్రమైన కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు.  తిరోగమన శని గ్రహ సంచారం 5 రాశులకు శుభప్రదంగా ఉంటుంది.

ఇంకా ఈ రాశులవారికి అదృష్టం కలిసి రానుంది. ఇంకా కనకవర్షం కురవనుంది. ఈ రాశులు.. మేషం, సింహం, కన్య, తుల, ధనస్సు.
 
మేష రాశి వారికి.. తిరోగమన శని సంచారం మేష రాశి వారికి ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. కార్యవిజయం, ధనలాభం వంటివి తప్పవు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలున్నాయి. వ్యాపారులకు లాభదాయకం.
 
సింహ రాశి - మకర రాశిలో శని ప్రవేశం సింహ రాశి వారి జీవితంలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగరీత్యా ప్రమోషన్ లభించే అవకాశం వుంది. వ్యాపారాభివృద్ధి ఖాయం.  
 
కన్య - శని రాశి మార్పు కన్యా రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగాలు చేసే వారు పెద్ద పదవిని లేదా విజయాన్ని పొందవచ్చు. ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి. 
 
తుల రాశి- శని సంచారం తులారాశి వారికి కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. 
 
ధనుస్సు - తిరోగమన శని సంచారం ధనుస్సు రాశి వారికి పురోగతికి అడ్డుపడే సమస్యలను దూరం చేస్తుంది. ఆత్మవిశ్వాసం పెరిగి విజయాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారం కుదురుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.