శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (23:42 IST)

06-02-2022 నుంచి 12-02-2022 వరకు మీ వార రాశిఫలితాలు (VIDEO)

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యం నెరవేరుతుంది. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. సోమ, బుధ వారాల్లో లావాదేవీలతో తీరిక ఉండదు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వేడుకల్లో ఆందరినీ ఆకట్టుకుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
అనుకూలతలు అంతంతమాత్రమే. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్తిమితంగా ఉండటానికి యత్నించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. మంగళవారం నాడు పనులతో సతమతమవుతారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం సద్వినియోగం చేసుకోండి. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వైద్యసేవలు అవసరం. కార్యక్రమాలు వాయిదా పడతాయి. ముఖ్యులను కలుసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పత్రాల రెన్యువల్ లో అలక్ష్యం తగదు. వ్యాపారాలు బాగున్నా సంతృప్తి ఉండదు. ప్రస్తుత వ్యాపారాలే సాగించండి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికం.
 
మిధునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఓర్పుతో మెలగాలి. విమర్శలు, అభియోగాలు ఎదుర్కుంటారు. మీ తప్పిదాలను సరిదిదుకోవటం ముఖ్యం. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఒక ఆహ్వానం సందిగ్గానికి గురిచేస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. బుధ, గురు వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నిరుద్యోగులకు నిరాశాజనకం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
ఆర్థికస్థితి నిరాశాజనకం. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆది, సోమ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. సాంకేతిక, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు.
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
ఈ వారం అన్ని రంగాల వారికి కలిసివస్తుంది. మాట నిలబెట్టుకుంటారు. ప్రతితభకు గుర్తింపు లభిస్తుంది. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. సంతానం చదువులపై శ్రద్ధ అవసరం. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. నూతన వ్యాపారాలకు అనుకూల సమయం. అధికారులకు కొత్త బాధ్యతలు, స్థానచలనం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 

 
 


కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
సంకల్పం సిద్ధిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆపులకు సాయం అందిస్తారు. కొత యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు బలపడతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరీ సోదరులతో అవగాహన నెలకొంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధి అవకాశాలు చేపడతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామిక వ్యాపారాలు కలిసివస్తాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారులకు ధనప్రలోభం తగదు. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
 
 
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు లోటుండదు. చెల్లింపుల్లో జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. గృహం సందడిగా ఉంటుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. సంతానం దూకుడకు కళ్లెం వేయండి. శంకుస్థాపనలకు అనుకూలం. పెట్టుబడుల విషయంలో పునరాలోచన శ్రేయస్కరం. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. చిన్న వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. రిప్రజెంటేటిలు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. అకాల భోజనం, విశ్రాంతి లోపం. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. ఆహ్వానం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. సన్నిహితులను కలుసుకుంటారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. గృహమార్పు చికాకుపరుస్తుంది. సోమ, మంగళ వారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం సంతృప్తికరం. మీ
సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
గత కొంత కాలంగా పడుతున్న ఇబ్బందులు తొలగుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు సామాన్యం. ఆపులకు సాయం అందిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. గురు, శుక్ర వారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆధిపత్యం
ప్రదర్శించవద్దు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. విద్యార్థులకు ఒత్తిడి అధికం. నిరుద్యోగులకు శుభయోగం. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
వ్యవహారదక్షతతో రాణిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. దుబారా ఖర్చులు విపరీతం. సోదరులతో సత్సంబంధాలు
నెలకొంటాయి. శుభకార్యాలకు హాజరవుతారు. ఆది, శని వారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రముఖుల సందర్శం కోసం పడిగాపులు తప్పవు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్న వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
పట్టుదలతో శ్రమించండి. విమర్శలు పట్టించుకోవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆత్మీయుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. మంగళ, బుధ వారాల్లో ఖర్చులు విపరీతం. పొదుపు మూలక ధనం ముందుగానే గ్రహిస్తారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి. జాతక పొంతన ప్రధానం. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. పనులు సాగక విసుగు చెందుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. గృహ మరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం.
 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ధైర్యంగా వ్యవహరిస్తారు. మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. పదవులు అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. పనులు సానుకూలమవుతాయి. శుక్ర, శని వారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ఖర్చులు విపరీతం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఉపాధి పథకాల పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెట్టుబడులు కలిసివస్తాయి. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.