మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 29 జనవరి 2022 (23:17 IST)

30-01-2022 నుంచి 05-02-2022 వరకు మీ రాశిఫలాలు (video)

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. గృహమార్పు కలిసివస్తుంది. వేడుకను ఘనంగా చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఆది, సోమ వారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యవహారాల్లో మెళకువ వహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. సంతానం ధోరణి ఇబ్బంది కలిగిస్తుంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ అవసరం. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ఉపాధ్యాయులకు పనిభారం. విద్యార్థులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
శ్రమించినా ఫలితం ఉండదు. మీపై శకునాల ప్రభావం అధికం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మంగళవారం నాడు పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి, సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరమవుతాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఒక ఆహ్వానం సందిగ్దానికి గురిచేస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు పదోన్నతి, స్థానచలనం. అవివ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
ఈ వారం ప్రతికూలతలు అధికం. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఓర్పుతో శ్రమించినగాని పనులు కావు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు ఆశాజనకం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య సాగుతుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. శ్రమ అధికం, ఫలితం శూన్యం. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. వాగ్వాదాలకు మీ తప్పిదాలను సరిదిద్దుకోవటం ముఖ్యం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. బుధ, గురువారాల్లో దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ అవసరం. పత్రాలు సమయానికి కనిపించవు. సన్నిహితులతో సంభాషణ ఊరటనిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు అనుకూలించవు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. విద్యార్థులకు ఒత్తిడి అధికం. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
వాగ్దాటితో రాణిస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. శుక్ర, శనివారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించి మెలగండి. పెట్టుబడులకు తరుణం కాదు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. బాధ్యతలు అప్పగించవద్దు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. గృహమార్పు అనివార్యం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు విపరీతం. మొండి బాకీలపై దృష్టి పెడతారు. పనుల్లో ఒత్తిడి అధికం. సోమ, మంగళవారాల్లో అప్రియమైన వార్తలు వింటారు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహమార్పు కలిసివస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. న్యాయ, ఆరోగ్య, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. మార్కెట్ రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పత్రాలు జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆదివారం నాడు ఏ పనీ చేయబుద్ధికాదు. ఆపులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఒక వ్యవహారంలో జోక్యం చేసుకోవలసి వస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, నగదు ప్రోత్సాహకరం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం ఉపశమనం కలిగిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఇరువర్గాలకు మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ధనమూలక సమస్యలెదురవుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఏజెంట్లు, రిప్రజెంటేటిన్లకు ఒత్తిడి, శ్రమ అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. గురు, శుక్ర వారాల్లో గుట్టుగా యత్నాలు సాగించండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో చర్చలు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వాహనం పిల్లలకివవ్వద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు  
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. శుభవార్తలు వింటారు. ఆప్తుల రాక ఉత్సాహాన్నిస్తుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలను విశ్వసించవద్దు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆది, సోమవారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. ప్రారంభోత్సవాలకు అనుకూలం. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. విద్యార్థులకు ఒత్తిడి, అధికం. ఉపాధ్యాయులు పురస్కారాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు
ఆర్థికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చీలికి మాటికి అసహనం చెందుతారు. మంగళ, గురు వారాల్లో ధన సమస్యలెదురవుతాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. అయిన వారితో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కలిసిరాదు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వృత్తుల వారికి కష్టకాలం. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి అధికం. కార్యక్రమాలు వాయిదా పడతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ప్రేమానుబంధాలు బలపడతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. బుధవారం నాడు అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయంలో మెళకువ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు ధనప్రలోభం తగదు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. గురు, శుక్ర వారాల్లో గుట్టుగా యత్నాలు సాగించండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో చర్చలు



జరుపుతారు.