మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 25 డిశెంబరు 2021 (21:03 IST)

26-12-2021 నుంచి 01-02-2022 వరకు మీ వార రాశి ఫలితాలు (video)

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఈ వారం ఏమంత అనుకూలం కాదు. అప్రమత్తంగా మెలగాలి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. సన్నిహితుల సలహా పాటించండి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ప్రశాంతంగా ఉండటానికి యత్నించుకోండి. అతిగా ఆలోచింపవద్దు. వ్యాపకాలు సృష్టించుకోండి. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆధ్యాత్మికత పై దృష్టి సారించండి. పిల్లల విషయంలో మంచే జరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన ఫలితాలనీయవు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. కార్మికులకు నిరాశాజనకం. సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. కొంతమంది తప్పుదారి పట్టిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు స్వాగతం పలుకుతారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు, పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. కీలక సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. అకాల భోజనం, విశ్రాంతి లోపం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సోమ, మంగళ వారాల్లో పనుల్లో ఒత్తిడి అధికం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహమార్పు చికాకు పరుస్తుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించండి. ఉపాధి పథకాలు చేపడతారు. కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. స్టాకిస్టులు, హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి, పుణ్యక్షేత్ర సందర్శలకు సన్నాహాలు సాగిస్తారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. గురువారం నాడు వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం సంతృప్తికరం. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వ్యాపారాభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. కార్మికులకు పనులు లభిస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. పనులు వేగవంతమవుతాయి. శుక్ర, శని వారాల్లో ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తించి లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామిక వ్యాపారాలు కలిసివస్తాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆందోళన కలిగించి సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఆది, సోమ వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రకటనలు, సందేశాల పట్ల అప్రమత్తతంగా ఉండాలి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సన్నిహితులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. వృత్తి, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాహనం పిల్లలకివ్వవద్దు.
 
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1 2 3 పాదములు 
అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ము కాదు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. మంగళ, బుధ వారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయజాలవు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
పట్టుదలకు పోవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తప్పు పట్టవద్దు. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఆది, గురు వారాల్లో చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ముఖ్యం. తొందరపడి హామీలివ్వవద్దు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితమీయవు. వృత్తుల వారికి నిరాశాజనకం. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.
 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
ఆర్థికంగా పురోగమిస్తారు. రోజు వారీ ఖర్చులే ఉంటాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. బుధ, శుక్ర వారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల సలహా పాటించండి. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. సంతాన సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రయాణం తల పెడతారు. 
 
 
మకరం , ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
మీ తప్పిదాలు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. పట్టుదలకు పోవద్దు. స్థిమితంగా ఆలోచించండి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. శనివారం నాడు అనుకోని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పత్రాలు సమయానికి కనిపించవు. చీటికిమాటికీ అసహనం చెందుతారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో మంచే జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. విశ్రాంతి అవసరం. గృహమార్పు నిదానంగా సత్ఫలితమిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి, ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. బెట్టింట్లకు పాల్పడవద్దు.

కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
వ్యవహారాలు అనుకూలిస్తాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆది, గురు వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. ఖర్చులు అదుపులో ఉండవు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ద వహించండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
మీనం : పూర్వాబాధ్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
అన్ని విధాలా అనుకూలదాయకమే. మాట నిలబెట్టుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. సోమ, మంగళ వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు విపరీతం, విలాసాలకు వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. అవివాహితులకు శుభయోగం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. గృహ మరమ్మతులు చేపడతారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాల్లో పురోగతి, అనుభవం గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం.