సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 18 డిశెంబరు 2021 (22:50 IST)

19-12-2021 నుంచి 25-12-2021 వరకు మీ వార రాశి ఫలితాలు (video)

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. త్వరలో సమస్యలు సద్దుమణగుతాయి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. మీపై శకునాల ప్రభావం అధికం. నోటీసులు అందుకుంటారు. మంగళ, బుధ వారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సన్నిహితుల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరి చికాకు పరుస్తుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. నూతన వ్యాపారాలు కలిసిరావు. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమనస్కంగా గడుపుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆది, సోమ వారాల్లో చేసిన పనులే చేయవలసి వస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. సంతానం చదువులపై శ్రద్ధ అవసరం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
శుభవార్తలు వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. తొందరపడి హామీలివ్వవద్దు, ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. దుబారా ఖర్చులు అధికం. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. గురు, శుక్రవారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త, పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఒక ఆహ్వానం సందిగ్గానికి గురిచేస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి, ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. సేవా, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మీ సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. అవివాహితుల ఆలోచనలు నిలకడగా ఉండవు. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. బుధ, గురు వారాల్లో పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. పెట్టుబడులు అనుకూలించవు. పనులు హడావుడిగా సాగుతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహపరుస్తుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. గృహమార్పు అనివార్యం. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు, వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి అధికం.
 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు అనుకూలతలున్నాయి. కార్యం సిద్ధిస్తుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆదాయం బాగుంటుంది. గత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. శుక్ర, శని వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. పరిచయాలు బలపడతాయి. వ్యూవహాత్మకంగా అడుగులేస్తారు. వస్త్ర, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కార్మికులు, వృత్తుల వారికి కొత్త పనులు లభిస్తాయి.
 
 
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 23 పాదములు 
ఆదాయాభివృద్ధి, ఆరోగ్య లాభం ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆప్తులకు ధనసహాయం అందిస్తారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు ఆశించవద్దు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలి. అభియోగాలు, విమర్శలు ఎదుర్కుంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు
మొండిధైర్యంతో వ్యవహరిస్తారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పనులు అర్ధాంతంగా ముగించవలసి వస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. చేతలో ధనం నిలవదు. సోమ, మంగళ వారాల్లో పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన మంచిది. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పెద్దల సలహా పాటించండి. ఇంటి విషయాలు పట్టించుకోండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. జూదాలు, బెట్టింట్లకు పాల్పడవద్దు. 
 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ప్రతికూలతలను అధిగమిస్తారు. కష్టం ఫలిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఆగ్రహావేశాలకు లోనుకావద్దు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. గృహంలో మార్పు చేర్పులు కలిసివస్తాయి. ఇంటి విషయాలపై శ్రద్ద వహించండి. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ఉద్యోగ బాధ్యతలో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. విద్యాసంస్థలకు ఆశాజనకం. ఆధ్మాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఏకపక్ష నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. విమర్శలు పట్టించుకోవద్దు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఆది, శని వారాల్లో ఒత్తిడి, శ్రమ అధికం. పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఓర్పుతో వ్యవహరించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను దీటుగా ఎదర్కుఉంటాతరు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు ఈ వారం అనుకూలదాయకమే. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. తాకట్టు విడిపించుకుంటారు. మనస్సు కుదుటపడుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వివాహ సంబంధాలపై శ్రద్ధ వహిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. పదవులు, సభ్యత్వాల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా మెలగండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. కార్మికులు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. 
 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు అన్ని రంగాల వారికి బాగుంటుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవుల అందుకుంటారు. మిమ్ములను వ్యతిరేకించే వారు అధికమవుతున్నారని గమనించండి. ఎవరినీ తప్పు పట్టవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.