గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 20 నవంబరు 2021 (18:32 IST)

21-11-2021 నుంచి 27-11-2021 వరకు మీ వార రాశి ఫలితాలు

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
కలిసివచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. విమర్శలు మీలో పట్టుదలను పెంచుతాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మంగళ, గురు వారాల్లో ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. గృహమార్పు అనివార్యం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. కార్మికులకు కొత్త పనులు లభిస్తాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2 పాదములు
దృఢసంకల్పంతో శ్రమిస్తే విజయం తధ్యం. యత్నాలు విరమించుకోవద్దు. ఆప్తుల వ్యాఖ్యలు మీపై సత్ర్పభావం చూపుతాయి. మొండి ధైర్యంతో వ్యవహరిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. బుధ, శుక్ర వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. సంతానం చదువులపై మరింత శ్రద్ద వహించండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
మనోధైర్యంతో వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు సామాన్యం. కొత్త పనులు ప్రారంభిస్తారు. అది, శని వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. సంప్రదింపులు వాయిదా పడతాయి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. పత్రాల రెన్యువల్ లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. పనివారల నిర్లక్ష్యం ఆగ్రహం కలిగిస్తుంది. ఎవరినీ నిందించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ప్రధానం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ప్రయాణం తలపెడతారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
ఆర్థిక లావాదేవీలు ముగుస్తాయి. రావలసిన ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. సోమ, మంగళ వారాల్లో ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. అపరిచితులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. భవన నిర్మాణ కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. స్టాక్ మార్కెట్ రంగం లాభాల బాటలో సాగుతుంది. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము 
మీ కష్టం ఫలిస్తుంది. పదవులు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు సానుకూలమవుతాయి. బుధ, గురు వారాల్లో ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వాగ్వాదాలకు దిగవద్దు. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలి. మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త చిత్త 1, 2 పాదములు
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రశీదులు జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. శుక్ర, శని వారాల్లో ఊహించని ఇబ్బందులెదురవుతాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. తొందరపాటు చర్యలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఒక ఆహ్వానం సందిగ్గానికి గురిచేస్తుంది. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు వేసుకుంటారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి,
 
తుల: చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. కొంతమంది వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఏదో సాధించలేకపోయామన్న వెలితి వెంటాడుతుంది. పెట్టుబడులకు తరుణం కాదు. ఆది, సోమ వారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. పిల్లల విషయంలో శుభపరిణామాలున్నాయి. పత్రాల రెన్యువల్ లో మెలకువ వహించండి. గృహమార్పు నిదానంగా మంచి ఫలితమిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగస్తులు ప్రశంసలందుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
అనుకూలతలు అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం ఉండదు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. ధనమూలన సమస్యలెదురవుతాయి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. మంగళ, బుధ వారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉపాధి పథతాలు నిరుత్సాహపరుస్తాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 123 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
వ్యవహార జయం, ధనప్రాప్తి ఉన్నాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆలోచనలు కార్యరూపం దౌల్చుతాయి. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. పనులు సానుకూలమవుతాయి. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సన్నిహితులను కలుసుకుంటారు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహ్వానం అందుకుంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారుల ప్రశంసలందుకుంటారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు, కార్మికులకు పనులు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆశాజనకం. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాగ్దాటితో ఆకట్టుకుంటారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ధనయోగం, వస్తులాభం ఉన్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. అది, మంగళ వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆశించిన పదువులు దక్కవు. ఏది జరిగినా మంచికేనని భావించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. విద్యార్ధులకు ఒత్తిడి అధికం. ప్రైవేట్ విద్యాలయాలకు కష్టకాలం. పోగొట్టుకున్న వస్తువులు లభించవు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
ఈ వారం అన్ని రంగాల వారికి కలిసివచ్చే సయయం. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. మీ అభిప్రాయాలను ఆప్తుల ద్వారా తెలియజేయండి. ఖర్చులు విపరీతం. ధనానికి లోటుండదు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. (ప్రైవేట్ సంస్థల్లో మదుపు క్షేమం కాదు. పనులు హడావుడిగా సాగుతాయి. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. గృహమార్పు అనివార్యం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.
 
మీనం : పూర్వాబాధ్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. పనులు అర్ధాంతంగా నిలిపివేస్తారు. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి.మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహపరుస్తాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.