మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (21:59 IST)

14-11-2021 నుంచి 20-11-2021 వరకు మీ వార రాశిఫలాలు

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఆర్థిక స్థితి సామాన్యం. నిస్తేజానికి లోనవుతారు. రోజులు భారంగా గడుస్తున్నట్టనిపిస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో ముందుకు సాగండి. యత్నాలు విరమించుకోవద్దు. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపకాలు సృష్టించుకోండి. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వేడుకలు, వనసమారాధనల్లో అత్యుత్సాహం తగదు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. కృషి ఫలించకున్నా నిరుత్సాహపడవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. గురువారం నగదు చెల్లింపుల్లో మెలకువ వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయస్తులరాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు అర్థాంతంగా ముగిస్తారు. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. షాపు పనివారలతో జాగ్రత్త. స్టాక్ మార్కెట్ లాభాల బాటలో సాగుతుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ధ్రం, పునర్వసు 1, 2, 3 పాదములు 
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. ఆది, శని వారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. నిరుద్యోగులకు శుభయోగం, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. చిరు వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
సంప్రదింపులకు అనుకూలం. వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పనులు వేగవంతమవుతాయి. సోమ, మంగళవారాల్లో నగదు, పత్రాలు జాగ్రత్త, సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. గృహ మరమ్మతులు చేపడతారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నతిని చాటుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. బుధ, గురువారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనాలోచితంగా వ్యవహరించవద్దు. పెద్దల సలహా పాటించండి. దుబారా ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
కన్య : ఉత్తర 2 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
అన్ని రంగాల వారికి శుభసమయం. హామీలు నిలబెట్టుకుంటారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఉత్సాహంగా గడుపుతారు. వివాహయత్నం ఫలిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెలకువ వహించండి గృహం సందడిగా ఉంటుంది. పనులు వేగవంతమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. శుక్ర, శనివారాల్లో వాగ్వాదాలకు దిగవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ప్రియతముల క్షేమం తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రిప్రజెంటేటిన్లు టార్గెట్లను అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యం. స్థిరాస్తి విక్రయంలో తొందరపాటు తగదు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఏకపక్ష నిర్ణయాలు తగవు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోండి. పట్టుదలకు పోవద్దు. ఆకస్మిక ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆదివారం కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. పనులు మందకొడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ ఆశక్తతను అర్థం చేసుకుంటారు. గృహమార్పు అనివార్యం. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
ప్రతికూలతలు అధికం. మీ సాయం పొందిన వారే విమర్శించేందుకు వెనుకాడరు. అభియోగాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో మెలగండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సోమ, గురు వారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. రవాణా రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1234 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఈ వారం ఆశాజనకం. పరిస్థితులు క్రమంగా అనుకూలిస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. సంతానం కదలికలను గమనించండి. గృహ మరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. దైవ, వనసమారాధన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
వ్యవహారాలు అనుకూలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. మీ శ్రీమతి సలహా పాటించండి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరుకు నిల్వలో జాగ్రత్త. సంస్థల స్థాపనకు అనుకూలం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు 
ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక వ్యవహారం మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. శుక్ర, శనివారాల్లో అపరిచితులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సన్నిహితులకు సాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదువుల దక్కకపోవచ్చు. ఏది జరిగినా మంచికేనని భావించండి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు ప్రశంసలందుకుంటారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ఆర్థిక స్థితి నిరాశాజనకం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. అతిగా ఆలోచింపవద్దు. ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. ఆదివారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆప్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. కనిపించకుండా పోయిన పత్రాలు వస్తువులు లభ్యమవుతాయి. ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం.