సంబంధిత వార్తలు
- 'ఘోస్ట్‌బస్టర్స్' సీక్వెల్‌గా 'ఘోస్ట్‌బస్టర్ : ఆఫ్టర్ లైఫ్' - 19న రిలీజ్
- 13-11-2021 శనివారం మీ రాశిఫలాలు : అభయ ఆంజనేయస్వామిని ఆరాధించిన...
- నవంబర్ 18.. ఒక్క రోజు మాత్రమే ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- 16న రాయలసీమ సాగునీటి సాధన సమితి సత్యాగ్రహం
- 12-11-2021 శుక్రవారం దినఫలాలు - పార్వతిదేవిని పూజించిన మనోవాంఛలు..
సంక్రాంతికి రాధేశ్యామ్.. నవంబర్ 15న ఈ రాతలే సాంగ్ (video)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ సినిమా అప్డేట్ వచ్చేసింది.
ఈ చిత్రంలోని ఈ రాతలే అనే తొలి సాంగ్ ను నవంబరు 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ పాటను విడుదల చేయనున్నట్లు చెప్పింది. అయితే హిందీ వర్షెన్ పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తుందో క్లారిటీ ఇవ్వలేదు. వింటేజ్ లవ్‌స్టోరీ మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్‌లో ప్రభాస్ లవర్‌బాయ్ పాత్రలో మెప్పించనున్నారు.
టీవలే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సోషల్‌మీడియా వేదికగా మూవీ టీమ్ ఈ టీజర్‌ను ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. లవర్‌బాయ్‌గా ప్రభాస్ లుక్, డైలాగ్‌లు, హావభావాలు అదిరిపోయాయి. ఇక జస్టిన్ ప్రభాకరణ్ అందించిన మ్యూజిక్ హైలెట్‌గా ఉంది.
తర్వాతి కథనం
