గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (13:00 IST)

చెమటలు పట్టి బట్టలు మొత్తం తడిసి పోయేవి: యాంకర్ ఉదయభాను

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంకర్‌గా నటిగా, ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ ఉదయభాను ఒకరు. ఒకవైపు టీవీ కార్యక్రమాలను చేస్తూనే మరోవైపు సినిమా ఆడియో ఫంక్షన్‌లు అంటూ ఎంతో బిజీగా ఉండేది. అలా సుమారు 15 సంవత్సరాల పాటు బుల్లితెర మహారాణిగా బుల్లితెరను ఏలింది. కానీ కవల పిల్లలు పుట్టాక బుల్లితెరకు దూరమైందని చెప్పాలి. 
 
అయితే ఒకానొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉదయభాను ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చిన్నతనం నుంచి ఎంతో కష్టపడే గుణం ఉన్న ఉదయభాను తన తల్లి డాన్స్ నేర్పించడంతో ఎన్నో స్టేజ్ షోలు చేశానని చెప్పారు. ఆ సమయంలోనే చాలామంది హీరోయిన్ మాదిరిగా ఉన్నావు సినిమాలలో ప్రయత్నించవచ్చు కదా అని అనడంతో ఆ ప్రభావం తనపై పడిందని అలా ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.
 
ఈమె ముందుగా యాంకర్ కన్నా ఎన్నో సినిమాలలో నటించారు. అలా ఉదయభాను నటించిన మొదటి సినిమా ఎర్రసైన్యం. ఆ సినిమాలో చూడటానికి ఎంతో ఎత్తు ఉన్నప్పటికీ తాను చిన్న దానిని అయితే ఆ సినిమాలో కొన్ని డైలాగులు చెప్పడానికి భయంతో చెమటలు పట్టి బట్టలు మొత్తం తడిసి పోయేవని ఈ సందర్భంగా ఉదయభాను తెలియజేశారు.
 
అలా భయపడే నేను హృదయాంజలి షో లో ఏకంగా 100 మంది ముందు మైక్ పట్టుకొని మాట్లాడాను అసలు ఆ కార్యక్రమం ఎలా చేశానో ఇప్పటికీ తనకు ఆశ్చర్యమేస్తుందని ఈ సందర్భంగా ఉదయ భాను వెల్లడించారు.