బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 అక్టోబరు 2021 (22:32 IST)

అన్న కుమార్తెను వేధించిన పాత్రలో రాజీవ్ కనకాల - నా భర్త అలాంటోడే అంటున్న సుమ

శేఖర్ కుమ్ముల దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'లవ్‌స్టోరీ'. నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం గత నెల 24వ తేదీన విడుదలై సక్సెస్ టాక్‌తో ప్రదర్శితమవుతుంది. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ను చిత్ర బృందం తాజాగా నిర్వహించారు. 
 
ముఖ్యంగా, 'లవ్‌ స్టోరీ' సినిమాలో రాజీవ్ క‌న‌కాల‌ ప్రేక్షకులు అసహ్యించుకునే పాత్రలో నటించారు. సాధారణంగా అలాంటి పాత్ర చేయడానికి ఎవరూ ముందుకురారు. కానీ రాజీవ్ కనకాల మాత్రం దర్శకుడు శేఖర్ కమ్ములను నమ్మి ముందడుగు వేశాడు. సొంత అన్న కూతురును చిన్నప్పుడు లైంగికంగా వేధించే బాబాయ్ పాత్ర ఇది. 
 
ఇలాంటి పాత్ర చేయడానికి రాజీవ్ కనకాల అంగీకరించారంటే .. ముందు ఆయన భార్య సుమ కనకాల కూడా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని సక్సెస్ మీట్‌లో శేఖర్ కమ్ముల చెప్పారు. అంతేకాదు 'లవ్ స్టోరీ' సినిమాకు ఈ రోజు ఇంత మంచి ఆదరణ లభిస్తుంది అంటే దానికి ప్రధాన కారణం రాజీవ్ కనకాల అంటూ దర్శకుడు శేఖర్ కమ్ముల అంగీకరించారు. 
 
తాజాగా ఈ సినిమా చూసిన రాజీవ్ కనకలా భార్య అయిన యాంకర్ సుమ ఎమోషనల్ అయ్యారు. కొందరు నటులు పాత్రలో లీనమై.. అది తన కోసమే పుట్టింది అని ఒదిగిపోతారు. అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. నా భర్త రాజీవ్ కనకాల కూడా అలాంటి అద్భుతమైన నటుడు అంటూ ప్రశంసల వర్షం కురిపించింది సుమ. ఇక లవ్ స్టోరీ లాంటి సున్నితమైన ఎమోషనల్ రియలిస్టిక్ డ్రామా అందించిన శేఖర్ కమ్ములని కూడా ప్రశంసలతో ముంచెత్తింది.