గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 21 జులై 2021 (12:39 IST)

ఐదు భాషల్లో విడుదల చేస్తున్న- ఇక్షు

Ikshu still
రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి న‌టిస్తున్న చిత్రం ఇక్షు. ఋషిక దర్సకత్వంలో హనుమంతురావు నాయుడు, డాక్టర్ గౌతమ్ నాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో వస్తున్న సినిమాను ఐదు భాషల్లో విడుదలకు సన్నాహాలు జ‌రుగుతున్నాయి.
 
చిత్ర నిర్మాతలు హనుమంత నాయుడు మాట్లాడుతూ\, గతంలో యన్ టి.ఆర్ జయంతి రోజున విడుదల చేసిన ఫస్ట్ లుక్, ఎన్టీఆర్ డైలాగ్ ను ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మేము ఐదు భాషల్లో విడుదల చేసిన ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ టైం హీరోగా రామ్ అగ్నివేశ్ ఇండస్ట్రీ కి ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు.

ఈ సినిమాలో ఒక సన్నివేశం ఎన్టీఆర్ గారి ఫేమస్ అయిన డైలాగ్ వుంది. ఆ డైలాగ్ ని హీరో రామ్ అగ్నివేశ్ సింగిల్ టేక్ లో చెప్పటం చాలా గొప్ప విషయం, ఆ డైలాగ్ ఎన్టీఆర్ గారి లాంటి గెటప్ వేసుకొని డైలాగ్ చెప్పటం గొప్ప విషయం, స్టోరీ స్క్రీన్ప్, డైరెక్షన్  చేసిన ఋషిక అనుకున్న దానికంటే సినిమాను చాలా చక్కగా తీశారు. సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇదే బ్యానర్ లో మరిన్ని సినిమాలు నిర్మించ బోతున్నాం. త్వ‌ర‌లో విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని అన్నారు.
 
దర్శకురాలు ఋషిక మాట్లాడుతూ, రామ్ అగ్నివేశ్చాలా చక్కగా నటించాడు. మా సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసిన ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయ‌న్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ గుత్తుల, మూల కథ: సిద్ధం మనోహర్, కెమెరా: నవీన్ తొడిగి, పాటలు:-కాసర్ల శ్యామ్, మ్యూజిక్: వికాస్ బాడిస.