శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (14:41 IST)

సునీల్‌ దర్జాలో అనసూయ భరద్వాజ్

కమెడియన్ సునీల్ ప్రస్తుతం హీరోగా మరియు విలన్‌గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సునీల్ ప్రస్తుతం పుష్ప సినిమాలో ఓ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఇదే సినిమాలో అనసూయ కూడా ఓ పాత్రలో నటిస్తున్నట్టు తెలిసిందే. 
 
అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తుంది. సునీల్ హీరోగా దర్జా అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ కథను అందిస్తున్నారు.
 
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సునీల్‌కు జోడీగా అనసూయ భరద్వాజ్ నటించబోతోందని టాక్. ఇప్పటికే ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ అనసూయను సంప్రదించారట. అనసూయ ఓకే చెబితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కూడా ఉందట. మరి అనసూయ ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి.