మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (16:25 IST)

పుట్టపర్తి వెళ్లిన సాయి పల్లవి.. సాదాసీదా చీరలో

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి. కొన్ని సినిమాలతోనే ఆమెకు మంచి ఇమేజ్ వచ్చింది. చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త తీసుకుంటుంది. తాజాగా పుట్టపర్తి సత్యసాయి ఆశ్రమంలో ఒక్కసారిగా ప్రత్యక్షమైంది సాయి పల్లవి. నార్మల్ సారీ కట్టుకుని పుట్టపర్తిలో పర్యటించింది సాయి పల్లవి.
 
తన సిబ్బందితో కలిసి పుట్టపర్తి వెళ్లిన సాయి పల్లవి… ఆ ఆశ్రమం విశేషాలను తెలుసుకుంది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల విడుదలైన లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది.