గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (14:17 IST)

అటువంటి ప‌నులు మ‌నుషులు మాత్రం చేయ‌రండి.. శివబాలాజీ భార్య

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ సంద‌ర్భంగా నటుడు శివ బాలాజీ చేతిని సినీ నటి హేమ గట్టిగా కొరికేశారు. దీంతో ఆయన నిమ్స్ ఆస్పత్రికెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. ఇది టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. 
 
అయితే, తాను ఆ పని చేయడానికి కారణాన్ని నటి హేమ వివరించారు. పోలింగ్ కేంద్రం వ‌ద్ద‌ తాను వెళ్తున్న స‌మ‌యంలో శివ బాలాజీ చేతిని అడ్డుగా పెట్టాడని, ఆయ‌నను తప్పుకోవాల‌ని కోరితే, త‌ప్పుకోలేద‌ని, అందుకే తాను అత‌డి చేతిని కొరికాన‌ని ఇప్ప‌టికే హేమ వివరణ ఇచ్చింది. 
 
ఈ ఘ‌ట‌న‌పై శివ బాలాజీ భార్య మ‌ధుమిత స్పందించింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'అటువంటి ప‌నులు మ‌నుషులు మాత్రం చేయ‌రండి.. ఇంకా దీనిక‌న్నా నేను ఏమీ చెప్ప‌లేను' అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అలాగే, తన భ‌ర్త విజ‌యంపై ఆమె స్పందిస్తూ, 'మ‌నం నిస్వార్థంగా సేవ చేసిన‌ప్పుడు దానికి ప్ర‌తిఫ‌లంగా విజ‌యం ద‌క్క‌లేదంటే ప్ర‌పంచంలో దేనికీ విజ‌యం ద‌క్క‌ద‌ని పేర్కొంది.