గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , శనివారం, 13 నవంబరు 2021 (15:26 IST)

న‌వంబ‌రు 17 నుండి పట్టాలెక్కుతున్న విజ‌య‌వాడ - నరసాపురం ట్రైన్

విజయవాడ - నరసాపురం మధ్య ప్రతి రోజూ నడిచేలా కొత్త రైలు సర్వీస్‌ను ప్రవేశపెట్టారు. ఈ నెల 17 నుంచి ఈ ప్యాసింజర్‌ రైలు నడుస్తుంది. 07877 నంబరు గల ఈ రైలు ప్రతి రోజూ విజయవాడ నుంచి ఉదయం 7.10కి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. మళ్లీ నరసాపురం నుంచి 07281 నంబర్‌తో మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరి సాయంత్రం 6.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. 
 
 
నరసాపురం – విజయవాడ మధ్య ప్రతి రోజూ నడిచేలా కొత్త రైలు సర్వీస్‌ను ప్రవేశపెట్టారు. ఈ నెల 17 నుంచి ఈ ప్యాసింజర్‌ రైలు నడుస్తుంది. 07877 నంబరు గల ఈ రైలు ప్రతి రోజూ విజయవాడ నుంచి ఉదయం 7.10కి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. మళ్లీ నరసాపురం నుంచి 07281 నంబర్‌తో మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరి సాయంత్రం 6.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
 
 
ఇక ప్రతిరోజూ నరసాపురం -విజయవాడ మధ్య నడిచే ఫాస్ట్‌ ప్యాసింజర్‌ రైలును ఇటీవల రైల్వే శాఖ ఎక్స్‌ప్రెస్‌గా మార్పు చేసింది. దీంతో మధ్యాహ్నం పూట నరసాపురం నుంచి విజయవాడకు ఎలాంటి సర్వీసులూ ప్రస్తుతం నడవడం లేదు. దీంతో ప్రయాణికులు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సర్వీసు ప్రారంభం కానుడడంతో ప్రయాణికులకు ఊరట లభించింది.