గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 11 నవంబరు 2021 (12:47 IST)

మహిళల ఆర్థికాభివృద్దే లక్ష్యంగా " జగనన్న పాల వెల్లువ "

సహకార డెయిరీ రంగాన్ని బలో పేతం చేసేందుకు జగనన్న పాలవెల్లువ ఎంతో దోహదపడుతుందని ఏపి పాడిపరిశ్రామభివృద్ధి సహకార సమాఖ్య యండి బాబు ఏ ఆన్నారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు జగనన్న పాలవెల్లువపై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఏపిడిడిసిఎఫ్ యండి బాబు ఏ. పాల్గొన్నారు.
 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళ పాడి రైతుల ప్రయోజనం కోసం చేపట్టిన సహకార డెయిరీ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జగనన్న పాలవెల్లువ వలన మహిళ పాడి రైతులకు మేలు జరుగుతుందన్నారు. గ్రామాల్లో పాడి రైతులకు మేలు చేసే సహకార సంస్థ తిరిగి బలోపేతం చేసేందుకు జగనన్న పాలవెల్లువ దోహదపడుతుందన్నారు. ఎలాంటి షూరిటీలు లేకుండా మహిళ పాడి రైతులకు రూ. 30 వేలు పర్కింగ్ క్యాపిటల్ అందిస్తామ‌న్నారు. అంతేకాకుండా ఎలాంటి షూరిటీలు లేకుండా పాలు పోసే రైతులకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా పాడి పశువులు కొనుగోలుకు రూ. 1.6 లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం జరుగుతుందన్నారు. 
 
 
జగనన్న పాలవెల్లువలతో మహిళలు ఆర్థిక పురోభివృద్ధి దిశగా ఇప్పటికే కొన్ని జిల్లాలో చేపట్టిన కార్యక్రమం ముందుకు వెళుతుందన్నారు. మరో వైపు పాడి రైతులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నారన్నారు. పాడి పశువులను కోనుగోలు చేసిన మహిళలకు మరింత చేయూతను ఇచ్చేందుకు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు నిర్మిస్తున్నమని ఇటువంటి మౌలిక సదుపాయాల కోసం 4 వేల కోట్లతో 9899 గ్రామాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఇవి  జగనన్న పాలవెల్లువలో చాలా కీలక పాత్ర పోషిస్తాయన్నారు. బియంసియు, ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
 
 
కృష్ణా జిల్లాలో మొదటి విడతగా 300 గ్రామాల్లో డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 1000 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ విజయవంతంగా సాగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా, చేయూత వంటి పథకాలను అందిపుచ్చుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే మార్గల్లో భాగంగా మహిళలు పాడి పశువులను కొనుగోలు చేసుకోవాలన్నారు. ఇది మహిళలు సుస్థిర ఆర్థికాభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 
 
 
జగనన్న పాలవెల్లువలో భాగంగా ఉయ్యురు క్లస్టర్ లో 5 మండలంలోని 69 ఆర్బికే. ల పరిధిలో
77 గ్రామాలు, నివాసిత ప్రాంతాల్లో పాల సేకరణకు 8 రూట్లను గుర్తించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మహిళలు  ఆర్థిక సర్వేతోభివృద్ధి చెందాలన్నారు.ఈ సందర్భంగా
జగనన్న పాలవెల్లువ మార్గదర్శకాలు ఇతర అంశాలను ఏపిడిడిసిఎఫ్ యండి బాబు.ఏ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు ఎల్. శివశంకర్, కె. మోహన కుమార్, ఆర్ డీ ఓ కె.రాజ్యలక్ష్మి, పశుసంవర్థక శాఖ జెడి. విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.