శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 15 సెప్టెంబరు 2021 (10:31 IST)

జ‌గ‌న‌న్న కాల‌నీకి దారిది.... చేబ్రోలు అధికారుల మొద్దు నిద్ర‌!

చేబ్రోలు మండ‌ల అధికారులు మొద్దు నిద్ర‌పోతున్నారు... దీనికి ఈ ర‌హ‌దారే ఉదాహ‌ర‌ణ‌. గుంటూరు జిల్లా పొన్నూరు నియెజకవర్గంలోని చేబ్రోలు మండలంలోని కొత్తరెడ్డి పాలెం జగనన్న కాలనీకి వెళ్లేర‌హ‌దారి ఇంత చ‌క్క‌గా ఉంది. ఇక్క‌డ పేద‌లు క‌ట్టుకుంటున్న 550 గృహాలకు వెళ్ళ‌డానికి ప్రదాన రహదారి పరిస్థితిని మీరే  పొటోలో ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ కాలనీవాసులకు దేవుడే దిక్కులా ఉంది. 
 
మండల అఫీసుకు కుతవేటు దూరంలోని 550 గృహాలు ఉన్న ఈ జగనన్నకాలనీవాసుల ఇబ్బందులు గురించి ఇప్పటికి పది మార్లు అధికారులకి తెలిపినా, పత్రికలలో వచ్చినా న్న అధికారులు, నాయకులు స్పందించకుండా మొద్దు నిద్రపొతున్నారు. 
 
కంటి తుడుపు పనులతో జగనన్న కాలనీవాసుల ఇబ్బందులు తీరేదేన్నాడో అని, త‌మ‌ని ఆదుకునే వారెవ‌రు అని 550 కుటుంబాల వారు బాధ‌ప‌డుతున్నారు. ఇప్పటికైనా హౌసింగ్ ఉన్నత అధికారులు, దయతో మా కాలనీ ప్రదాన రహదారిని,  లోపలి రహదారులను త్వరితగతిన నిర్మాణం చేయాల‌ని కోరుతున్నారు.