జగనన్న కాలనీలలో తక్షణం మౌలిక సదుపాయాల కల్పన
జగనన్న కాలనీలలో గృహ నిర్మాణ ప్రగతిపై కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో సమీక్ష జరిగింది. గృహ నిర్మాణ ప్రగతిపై పంచాయతీరాజ్, రెవెన్యూ, డ్వామ అధికారులతో నందిగామ శ్రీకారం కళ్యాణ మండపంలో నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావుతో కలిసి జిల్లా కలెక్టర్ జె.నివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గంలోని అన్నిశాఖల అధికారులు, సర్పంచులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు సమీక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం తరఫున కల్పించేలా చర్యలు చేపట్టి, వారు ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ముఖ్యంగా జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని ఆదేశించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్లు కె.మాధవిలత, శ్రీనివాస్ నూపూర్ అజయ్ కుమార్, కె. మోహన్ కుమార్, సబ్ కలెక్టర్ జి.ఎస్. ఎస్.ప్రవీణ్ చంద్, నగర పంచాయితి కమీషనర్, నియోజకవర్గంలో ని అన్ని శాఖల అధికారులు, నాలుగు మండలాల తహసీల్దార్లు, యంపిడి వోలు పాల్గొన్నారు.