సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (08:29 IST)

బీసీ బంధు పథకాన్ని ప్రకటించాలి: ఆర్‌.కృష్ణయ్య

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముందు రాష్ట్రంలో బీసీ బంధు పథకాన్ని ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

ప్రతి బీసీ కుటుంబానికి పది లక్షల రూపాయలు కేటాయించాలన్నారు. 8న రాష్ట్ర వ్యాప్తంగా బీసీల శంఖారావం నిర్వహిస్తున్నట్లు కృష్ణయ్య చెప్పారు.

కలెక్టర్లు, తహసీల్దార్‌ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు చేపడుతున్నామని చెప్పారు. మరోవైపు, ఈ నెల 8న ఓయూ ఆడిటోరియంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.