బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:25 IST)

గుంటూరు జిల్లాలో టీడీపీ కార్పోరేటర్‌ హత్యకు కుట్ర

గుంటూరు జిల్లాలోని టీడీపీ కార్పోరేటర్‌ యల్లావుల అశోక్‌ యాదవ్‌ హతమార్చేందుకు పన్నిన కుట్రను ముందుగానే పోలీసులు గుర్తించారు. ఈ కుట్రకు కన్నెగంటి బాలకఅష్ణ పధకం పన్నినట్లు తెలుస్తోంది.

నిఘా వర్గాల ద్వారా హత్య కుట్రను తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టాభిపురం పోలీసులు బాలకఅష్ణను అదుపులోకి తీసుకున్నారు. గత ఎన్నికలలో అశోక్‌ను ఓడించేందుకు బాలకఅష్ణ అనేక ప్రయత్నాలు చేశాడు.

టీడీపీలో అశోక్‌ ఎదుగుదలను బాలకఅష్ణ ఓర్వలేకపోయాడని తెలుస్తోంది. కాగా బాలకఅష్ణను కాపాడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

గతంలో రౌడీ షీటర్‌ బసవల వాసు హత్య కేసు, కాలవ రమణ హత్య కేసులో, ఓ విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి నగ చిత్రాలు, వీడియోలు తీసిన కేసులో బాలకఅష్ణపై ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో బాలకఅష్ణను ఈ కేసుల నుంచి తప్పించారనే ఆరోపణలు వచ్చాయి.