గురువారం, 7 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 జూన్ 2021 (11:01 IST)

వుహాన్ ల్యాబ్‌లో కరోనా మూలాలు.. అదంతా అమెరికా సృష్టే!

క‌రోనా వైర‌స్ పుట్టినిల్లు చైనానే అంటూ ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కరోనాకు పుట్టినిల్లు చైనానేనని అగ్ర‌రాజ్యం అమెరికాతో పాటు ప్ర‌పంచంలోని అన్ని దేశాలు అమెరికా వాద‌న‌తో ఏకీభ‌వించాయి. దీంతో చైనా ప్ర‌పంచ దేశాల ముందు దోషిగా నిల‌బ‌డాల్సి వ‌స్తుంది. 
 
అయితే ఇప్పుడు కొత్త అంశం తెర‌మీద‌కు తెచ్చింది చైనా. క‌రోనా వైర‌స్ అమెరికా సృష్టే అంటూ ఆరోప‌ణ‌లు చేస్తుంది. కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అమెరికానే అని ప్రత్యారోపణలు చేసింది. ఈ సంచ‌లన ఆరోప‌ణ‌ల చేసింది ఎవ‌రో కాదు చైనా విదేశాంగ అధికార‌ప ప్ర‌తినిధి వాంగ్. ఈ ఆరోప‌ణల వెనక కొన్ని ఆధారాలు కూడా చెబుతున్నారు.
 
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్సిన్ అమెరికాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తద్వారా కరోనా వైరస్ మూలాలు ఎక్కడివన్న అంశాన్ని నిగ్గు తేల్చాలని అన్నారు. అమెరికాలోని ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్ సహా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ ఉత్పన్నమైనట్టు పలు రిపోర్టులు చెబుతున్నాయని వెన్సిన్ పేర్కొన్నారు. అమెరికా గోప్యంగా ఉంచిన నివేదికలో వుహాన్ ల్యాబ్‌లో కరోనా మూలాలకు సంబంధించిన సమాచారం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే చైనా ప్రత్యారోపణలకు దిగినట్టు అర్థమవుతోంది. 
 
చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్సిన్ మాట్లాడుతూ.. గతంలో తమపై ఆరోపణలు వచ్చినప్పుడు డబ్ల్యూహెచ్ఓ దర్యాప్తుకు సహకరించామని, ఇప్పుడు అమెరికా కూడా డబ్ల్యూహెచ్ఓ నిపుణులతో దర్యాప్తుకు ముందుకు రావాలని వెన్సిన్ స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన ఫోర్ట్ డెట్రిక్ ల్యాబొరేటరీపై అనేక ఆరోపణలు ఉన్నాయని, డబ్ల్యూహెచ్ఓ తనిఖీలకు అమెరికా అనుమతించాలని డిమాండ్ చేశారు.