మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (14:07 IST)

పాకిస్థాన్‌కు డ్రాగన్ కంట్రీ షాక్.. అప్పులున్నాయంటే.. పట్టించుకోలేదు..

China_Pakistan
పాకిస్థాన్‌కు డ్రాగన్ కంట్రీ చైనా షాక్ ఇచ్చింది. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు చైనా షాకిచ్చింది. సీపెక్‌కు సంబంధించిన 31 బిలియన్ డాలర్ల అప్పులను రీస్ట్రక్చర్ చేయాలంటూ చైనాను సాయం అడిగింది. అయితే ఆ రిక్వెస్ట్‌ను తాజాగా చైనా సర్కార్ తిరస్కరించింది. మరోవైపు పాక్ అప్పులు 2020  డిసెంబర్ నాటికి 294 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆ మెత్తం పాక్ జీడీపీలో 109శాతంగా ఉంది. 
 
సీపెక్ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటివరకు 31 బిలియన్ డాలర్లకు మించిపోయింది. పాక్ విదేశీ అప్పులు 115 బిలియన్ డాలర్లు ఉన్నాయి. పారస్ క్లబ్ నుంచి 11, వివిధ దేశాల నుంచి 33, ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్లలపైగా పాకిస్తాన్ ప్రభుత్వం సమీకరించింది. అంతేకాదు బాండ్ల రూపంలో అంతర్జాతీయంగా 12 బిలియన్ డాలర్ల నిధులను తీసుకొచ్చింది. దీంతో పాక్ అప్పులు కొండల పెరుకుపోయాయి.