సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (12:21 IST)

ధోనీని ఆడించేందుకు దాదాను పది రోజులు బతిమాలితే..?: కిరణ్ మోరె

2003-04 దిలీప్ ట్రోఫీ ఫైనల్‌లో దీప్‌దాస్ గుప్తా బదులు ఎమ్మెస్ ధోనీని ఆడించడానికి తాము ఎంత ప్రయాసపడ్డామో, అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీని ఒప్పించడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో చెప్పుకొచ్చాడు మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ కిరణ్ మోరె.

ఆ సమయంలో నిజానికి ఇండియన్ నేషనల్ టీమ్‌కు రెగ్యులర్ వికెట్ కీపర్ లేడు. లెజెండరీ ప్లేయర్ రాహుల్ ద్రవిడే ఆ బాధ్యతలు కూడా మోస్తున్నాడు. టీమ్‌లో కీలక బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా అతడు విజయవంతమయ్యాడు. 
 
2003 వరల్డ్‌కప్‌లోనూ ఆడాడు. అయితే ఎక్కువ కాలం ఇలా కొనసాగకూడదని, ఇండియన్ టీమ్‌కు ఓ రెగ్యులర్ వికెట్ కీపర్ కావాల్సిందనని సెలక్టర్లు భావించారు. అదే సమయంలో దేశవాళీ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తున్న ధోనీ గురించి చీఫ్ సెలక్టర్ కిరణ్ మోరె తెలుసుకున్నాడు. 
 
దీనికోసం అప్పటి కెప్టెన్ గంగూలీ వెంట పడ్డాడు. దాదాకు మాత్రం తుది జట్టులో తన కోల్‌కతాకే చెందిన దీప్‌దాస్ గుప్తాను ఆడించాలని ఉంది. దీంతో గంగూలీని ఒప్పించడానికి తాము చాలా ప్రయాస పడాల్సి వచ్చిందని కిరణ్ మోరె చెప్పాడు. ఏకంగా 10 రోజుల పాటు దాదాను బతిమాలితే మొత్తానికి అతడు అంగీకరించాడు అని మోరె తెలిపాడు. ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేసిన ధోనీ, రెండో ఇన్నింగ్స్‌లో 47 బంతుల్లోనే 60 పరుగులు చేసి సత్తా చాటాడు.