Teja sajja, zemenini kiran, etc
మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ 'జాంబీ రెడ్డి` హీరో తేజ సజ్జాతో 'ఇష్క్`అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంతో యస్.యస్. రాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆర్.బి. చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‌కి మంచి ఆదరణ వచ్చింది. ఏప్రిల్ 23న ఈ చిత్రం విడుదలవుతుంది. కాగా, ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో సాయి తేజ్‌ఇటీవలే విడుదలచేశారు.
ఈ విషయాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన సమావేశంలో వాకాడ అప్పారావు మాట్లాడుతూ,సూపర్‌గుడ్ ఫిలింస్, మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ రెండు ఒక్కటే. మా సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థ ద్వారా గడిచిన ఇరవైఏళ్లలో ప్రేక్షకులకు ఎన్నో సూపర్ హిట్స్, మెగా హిట్స్ అందించాం. తమిళ చిత్ర పరిశ్రమలో బిజీగా ఉండటం, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆరేడుఏళ్ళుగా తెలుగులో సినిమాలు తీయలేకపోయాం. అందుకు చాలా బాధగా ఉంది. కొంతగ్యాప్ తర్వాత మా బ్యానర్‌లో వస్తున్న చిత్రం ఇష్క్. ఇందులో తేజ, ప్రియా ప్రకాష్ వారియర్లతో పాటుగా తమిళ నటుడు రవీందర్ ఓ కీ రోల్ చేశారు. నటీనటులతో పాటుగా సాంకేతికనిపుణులు కూడా బాగా వర్క్ చేశారు. మా సినిమాను ఈనెల 23న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను`` అన్నారు
ఈ చిత్ర దర్శకుడు యస్.యస్. రాజు మాట్లాడుతూ, ``నా గురువుగారు కెమెరామేన్ సమీర్‌రెడ్డిగారి వల్ల నాకు ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాను 29 రోజుల్లో క్వాలిటీగా చేయడానికి కారణం ఎన్వీప్రసాద్, వాకాడ అప్పారావు, శ్యామ్‌కేనాయుడు సహకారంవల్లే.తేజ, ప్రియా, రవీందర్ ఇలా అందరు బాగా చేశారు. మహతి స్వరసాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారని` అన్నారు.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, `మళయాలంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఓ మంచి సినిమాను తెలుగులో ఇష్క్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. మెగా గుడ్ ఫిలింస్ సంస్థలో సినిమా అంటేనే రిచ్‌గా ఉంటుంది. కొత్త తరహా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల అందరికీ ఇష్క్ సినిమా నచ్చుతుందని` తెలిపారు.
ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ మాట్లాడుతూ, ``తేజ యంగ్ అండ్ డైనమిక్ హీరోలా కనిపిస్తున్నాడు. జాంబీరెడ్డి` వంటి మంచి సినిమా తర్వాత మెగా సూపర్‌గుడ్‌ఫిలింస్ సంస్థ వంటి మంచి బ్యానర్‌లో తేజ సజ్జా చేసిన ఇష్క్ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను`` అన్నారు.
హీరో తేజ సజ్జా మాట్లాడుతూ, మా ట్రైలర్‌ను విడుదల చేసిన హీరో సాయితేజ్ గారికి ధన్యవాదాలు. అలాగే ఇష్క్ టైటిల్‌తో నితిన్‌గారి సినిమా ఉంది. మీ సినిమా టైటిల్ ఉపయోగించుకుంటున్నాము అనగానే నితిన్‌గారు సరే అనడమే కాకుండా, మా సినిమాలోని ఆనందం...సాంగ్ కూడా ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నితిన్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఒక కొత్త రకం కథ. జాంబీరెడ్డి వంటి డిఫరెంట్ జానర్ తర్వాత నేను చేసిన సినిమా ఇష్క్. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఆడియన్స్‌కు న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. కొంత గ్యాప్ తర్వాత వస్తున్న మెగాసూపర్‌గుడ్ ఫిలింస్ వారు ఫస్ట్ సినిమా నాతో చేయడం సంతోషంగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే ఈ సంస్థ వారు ప్రొత్సహిస్తుంటారు. ఇష్క్ సినిమాలో కూడా మంచి కంటెంట్ ఉంది. తప్పకుండా ఆడియన్స్‌కి నచ్చే చిత్రమిది`` అన్నారు.
తారాగణం:
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్, తమిళ నటుడు రవీందర్
సాంకేతిక బృందం:
డైరెక్టర్: యస్.యస్. రాజు
నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్
సమర్పణ: ఆర్.బి. చౌదరి
బ్యానర్: మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్
మ్యూజిక్: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటింగ్: ఎ. వరప్రసాద్
ఆర్ట్: విఠల్ కొసనం
లిరిక్స్: శ్రీమణి