డైలమాలో గద్దల కొండ గణేష్
సినిమా సాఫీగా సాగాలంటే దర్శక నిర్మాతల మధ్య అవగాహన వుండాలి. సినిమా బాషలో వీరిద్దరూ భార్యభర్తలు లాంటివారని నానుడి. కనుక సినిమా మేకింగ్‌లో దర్శకుడు కావాల్సిన మేరకు స్వాతంత్రం వుండాలంటారు. అదిలేకపోతే సినిమా గాడితప్పుతుంది. ప్రస్తుతం వరుణ్‌తేజ్ నటిస్తున్న `గని` సినిమాకు అదే జరిగింది. కిరణ్ కొర్రపాటి రచన, దర్శకత్వం వహించారు సిధు ముద్దా, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కరోనా కంటే దర్శక నిర్మాతల మధ్య మనస్పర్థల వల్ల ఆగిపోయింది.
స్పోర్ట్స్ డ్రామా చిత్రమిది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే సినిమా కనుక ఇందుకు సంబంధించిన బాక్సింగ్ కోర్టును 50 లక్షలతో భారీ సెట్ వేశారు. కానీ అక్కడ షూట్ చేయలేకపోయారు. కారణం నిర్మాతల్లో ఒకరు తప్పుకోవడమే. దాంతో సాఫీగా సాగాల్సిన షూటింగ్ అర్థంతరంగా ఆగిపోయింది. దీని గురించి ఏమి చేయాలో గద్దల కొండ గణేష్ (వరుణ్ తేజ్)కు అర్థం కాక సతమతమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికితోడు వరుణ్‌తేజ్ కథ విషయంలో సంతృప్తికరంగా లేడనీ కొంత మార్పుచేయాలని సూచన చేశాడట. ముందు కథంతా విని సెట్‌పైకి వెళ్ళి కొంత భాగం షూట్ చేశాక ఈ పరిణామాలు జరగడంతో దర్శకుడు తన వల్లకాదని చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.
పైగా ఈ బాక్సింగ్ సెట్ లో భారీగా జూనియర్ ఆర్టిస్టులుకూడా కావాల్సి వుంటుంది. బాక్సింగ్‌ను సీన్స్ చేయడానికి పారిస్ పైటర్లుకూడా ప్రస్తుతం అందుబాటులో లేరని సమాచారం. అందుకే గద్దలకొండకు ఏమి చేయాలో అర్థంకాక దేవుడిపైనే భారం వేశాడు. గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్‌తేజ్‌పై ఓ సాంగ్ వుంటుంది. `చంద్రునికైనా లేదా మచ్చ, నే కాలుపెడితే రచ్చ..`అంటూ పల్లవితోసాగుతుంది. మరి ఈసినిమా ఆయనకు మచ్చగా నిలిచిపోతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.