శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 మే 2021 (16:08 IST)

ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు.. కారు బాంబు పేలి 30మంది మృతి

ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు విజృంభించారు. ఆప్ఘన్, తూర్పు లోగర్ ప్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. వందమందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో విద్యార్థులు అధికంగా ఉన్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 
 
తాలిబన్లు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, వారి నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. రంజాన్ ను పురస్కరించుకుని ఉపవాస దీక్షల అనంతరం పలువురు లోగర్ ప్రావిన్స్‌లోని ఓ ఇల్లును గెస్ట్‌హౌస్‌గా వాడుకుంటున్నారు. 
 
శుక్రవారం రాత్రి ప్రార్థనల అనంతరం ఉపవాసం విడిచిన వారు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గెస్ట్ హౌస్‌కు ఆనుకుని ఉన్న రోడ్డుపై కారు బాంబు పేలింది. 
 
ఈ ధాటికి గెస్ట్‌హైస్ కుప్పకూలిపోయి 30 మంది ఘటనాస్థలిలోనే చనిపోయారు. సుమారు 100 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి , అన్నీ కోణాల్లో విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.