శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 10 జులై 2021 (10:58 IST)

ఐపీఎస్ అధికారిపై దేశద్రోహం కేసు

దేశంలో ఓ ఐపీఎస్ అధికారిపై దేశద్రోహం కేసు నమోదైంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఈ కేసు నమోదైంది. రెండు వ‌ర్గాల మ‌ధ్య శ‌త్రుత్వాన్ని పెంచేందుకు ఐపీఎస్ జీపీ సింగ్ ప్ర‌య‌త్నించాడ‌ని, ప్ర‌జానేత‌లు, ప్ర‌భుత్వం ప‌ట్ల కుట్ర ప‌న్నిన‌ట్లు ఆయనపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. 
 
అయితే తొలుత అక్ర‌మాస్తుల కేసులో ఐపీఎస్ ఆఫీస‌ర్ గ‌త వార‌మే స‌స్పెష‌న్‌కు గుర‌య్యాడు. ఏసీబీ, ఎక‌నామిక్ అఫెన్సెస్ వింగ్ చేసిన దాడుల్లో జీపీ సింగ్ వ‌ద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న‌ట్లు తేలింది. సోదాలు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో దొరికిన కొన్ని కాగితాల ఆధారంగా అత‌నిపై దేశ‌ద్రోహం కేసు బుక్ చేశారు.