సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శుక్రవారం, 1 అక్టోబరు 2021 (11:17 IST)

జ‌గ‌న‌న్నకాల‌నీలు, ఇళ్ళ స్థ‌లాలు మునిగిపోతున్నాయ‌ని ధ‌ర్నా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వై.ఎస్. జ‌గ‌న్ ప్రభుత్వం జ‌గ‌న‌న్న కాల‌నీల పేరిట ఇచ్చిన ఇళ్ళ స్థ‌లాల‌పై ఇపుడు ల‌బ్ధిదారులు గ‌రం గ‌రం అవుతున్నారు. చిన్న పాటి వ‌ర్షానికే ఇళ్ళ స్థ‌లం మునిగిపోతోంద‌ని, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చెరువులో ఇళ్ల పట్టాలు ఇచ్చారంటూ ప్రధాన రహదారిపై ల‌బ్ధిదారులు ధర్నాకి దిగుతున్నారు. 
 
కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం వద్ద చెరువులో ఇళ్ల పట్టాలు ఇచ్చార‌ని ల‌బ్ధిదారులు గ‌గ్గోలు పెడుతున్నారు. వర్షం పడితే నీట మునుగుతాయ‌ని, ఇపుడు కాలు కూడా పెట్ట‌లేని స్థితిలో త‌యార‌య్యాయ‌ని ఆందోళన చేస్తున్నారు. దీనితో విజయవాడ, నూజివీడు ప్రధాన రహదారిపై గంట నుండి 3 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వీరి ధ‌ర్నాతో సాధార‌ణ ప్ర‌యాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనితో సంఘటనా స్థలానికి చేరుకున్నఆగిరిపల్లి పోలీసులు ఆందోళ‌న కారుల‌ను చెద‌ర‌గొట్టారు.